డిస్కో రాజా బేబీస్ లో ఆమె రోల్ సో స్పెషల్

  • January 21, 2020 / 05:00 PM IST

కేవలం మరో మూడురోజులలో రవి తేజ డిస్కో రాజా విడుదల కానుంది. సరైన విజయం అందుకొని చాలా రోజులవుతున్న రవితేజ ఈ చిత్రంపై చాల ఆశలే పెట్టుకున్నారు. అలాగే ఈ చిత్ర విజయంపై ఆయన సూపర్ కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నారు. సైంటిఫిక్ ఫిక్షనల్ స్టోరీగా వస్తున్న ఈ చిత్రంలో రవి తేజ రోల్ చాల భిన్నంగా ఉంది. ఒక టీజర్ లో ఆయనపై ఏదో ప్రయోగాలు చేస్తున్నట్లు, అలాగే మరో టీజర్ లో పోస్ట్ వార్ మెంటల్ డిజార్డర్ అంటూ, ఆయన్ని ఓ పేషెంట్ గా ప్రజెంట్ చూపించారు. రవితేజ ఐతే రూత్ లెస్ కిల్లర్ గా కనిపిస్తున్నాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ ఎప్పటిలాగే ఎనర్జిటిక్ గా ఉంది. ఐతే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తుండగా వారిలో పాయల్ రాజ్ పుత్ రోల్ పై సందిగ్దత కొనసాగుతుంది.

దర్శకుడు కూడా పాయల్ పాత్ర సో స్పెషల్ అన్నారు. మిగతా ఇద్దరు హీరోయిన్స్ లో తాన్యా సైంటిస్ట్ రోల్ చేస్తుంది, ఇక నభా నటేష్ బ్యాంకు ఎంప్లాయ్ గా చేస్తున్నారు. మరి పాయల్ రోల్ ఏమిటీ అనేది ఆసక్తికరం. ఈ చిత్రంలోని ఆమె లుక్స్ కొన్ని బయటకు రాగా అవి వింటేజ్ గెటప్ లో ఉన్నాయి. ఖచ్చితంగా పాయల్ 90’స్ లేడీ గా కనిపించనుంది. రవితేజ తో ఆమెకు ఉన్న ఓ సాంగ్ కూడా బాలు గారితో అలనాటి పాటలను తలపించేదిగా పాడించారు. అసలు పాయల్ రవితేజ లమధ్య ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ ఏంటి అనేది అర్థం కావడం లేదు. అందుకే పాయల్ రోల్ డిస్కో రాజా చిత్రంలో ప్రత్యేకంగా నిలువనుంది. అందం అభినయం అన్నీ ఉన్నా పాయల్ కి కాలం కలిసి రావడం లేదు. ఓ స్థాయి హీరో పక్కన సోలో హీరోయిన్ ఛాన్స్ రావడం లేదు. మరి డిస్కో రాజా అయినా ఆమెను టాలీవుడ్ లో నిలబెడుతుందేమో చూడాలి.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus