శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెదకాపు 1 ‘ చిత్రం సెప్టెంబర్ 29న అంటే ఈరోజు రిలీజ్ కాబోతోంది. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన బావమరిది విరాట్ కర్ణ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. టీజర్, ట్రైలర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. గోదావరి జిల్లాల నేపథ్యంలో 1980ల నాటి కాలంలో జరిగే కథ ఇది.
ఒక ప్రాంతంలో ఉండే ఇద్దరు పెద్ద రాజకీయ నాయకులు బయన్న & సత్య రంగయ్య. సత్య రంగయ్య చేసిన కొన్ని తప్పిదాలు వల్ల పదవికి 15 ఏళ్ళు దూరమవుతాడు. ఆ తప్పిదాలు ఏంటి. సత్య రంగయ్య వద్ద పనిచేసే వాళ్ళు అతనికి ఎందుకు ఎదురు తిరిగారు. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఏంటి.? హీరో పెద కాపు యొక్క కథ ఏంటి.? అనేది ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడట శ్రీకాంత్ అడ్డాల.
శ్రీకాంత్ అడ్డాల రచన & దర్శకత్వం, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ ,విరాట్ కర్ణ పెరఫామెన్స్, మిక్కీ జె మేయర్ సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు. స్లో నెరేషన్, లవ్ ట్రాక్, సాంగ్స్ అనేవి మైనస్ గా మారాయని తెలుస్తుంది. మరి మార్నింగ్ షోలు (Peddha Kapu 1) ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
#PeddhaKapu1 akkadakkada pace tappa super hit cinema. Intro, interval and climax will give you goosebumps.
Maa @anusuyakhasba gariki career best character. Take a bow iraga tesaru Anasuya garu.