People Media Factory: వచ్చిందల్లా పోతోంది.. ప్లానింగ్ ఏమవుతోంది ‘పీపుల్‌’.!

  • June 23, 2023 / 12:54 PM IST

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ.. ఈ మధ్య టాలీవుడ్‌లో మాంచి జోరు మీదున్న సినిమా ప్రొడక్షన్‌ హౌస్‌ పేరిది. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ వచ్చిన పీపుల్‌ టీమ్‌… ఇప్పుడు భారీ స్థాయి సినిమాలు తెరకెక్కిస్తోంది. ఏ రేంజిలో సినిమాలు చేస్తున్నారు అంటే… ఏకంగా 25 సినిమాలు పూర్తి చేసుకున్నారు. మరో 18 నెలల్లో 25 సినిమాలు పూర్తి చేసి మొత్తంగా 50 సినిమాలు పూర్తి చేసేయాలనేది టీమ్‌ ఆలోచన. అయితే జోరుకు తగ్గ ఫలితాలు వస్తున్నాయా అంటే లేవనే చెప్పాలి.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ల ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇవి కాక బోలెడన్ని సినిమాలు ఆ సంస్థలో ప్లానింగ్‌లో ఉన్నాయి. అంత పెద్ద సినిమాలు వరుసగా ప్లానింగ్‌లో ఉన్నాయంటే సినిమాలకు మంచి లాభాలే వచ్చుండాలి. గతేడాది ‘కార్తికేయ 2’, ‘ధమాకా’ లాంటి సినిమాలు మంచి వసూళ్లతో అదరగొట్టాయి. రెండు సినిమాలు వంద కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. దాని వల్ల పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయి అని చెప్పొచ్చు.

ఈ విజయాల ఊపులోనే భారీ చిత్రాలను ప్లాన్ చేసింది పీపుల్‌ మీడియా. కానీ 2023లో పీపుల్‌ మీడియా వాళ్లకు ఏం బాలేదు. ‘రామబాణం’ అంటూ వచ్చి సరైన విజయం అందుకోలేకపోయారు. ఇప్పుడు ‘ఆదిపురుష్‌’ కోసం పెద్ద మొత్తంలో పెట్టి తెలుగులో విడుదల చేశారు. సినిమా తొలి రోజు ఓపెనింగ్స్ చూస్తే కాస్త ఆశాజనకంగానే కనిపించింది కానీ ఆ తర్వాత నిలబడలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుండి వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఇప్పుడు మరీ దారుణంగా ఉంది. దీంతో సంపాదించింది మొత్తం ఇలా పోతోందా అనే భయం కలుగుతోంది.

ప్రస్తుతం (People Media Factory) పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ల చేతిలో పెద్ద సినిమాలు వరుసగా ఉన్నాయి. పవన్‌ కల్యాణ్‌ – సాయి ధరమ్‌ తేజ్‌ ‘బ్రో’, ప్రభాస్‌ – మారుతి సినిమా వరుసలో ఉన్నాయి. ఇవి కాకుండా శర్వానంద్‌ సినిమా ఒకటి ఉంది. ఇది కాకుండా ప్రభాస్‌ – సందీప్‌ రెడ్డి వంగా ‘స్పిరిట్‌’ సినిమాను కూడా రిలీజ్‌ చేస్తారు. దీంతో వీటిలో అయినా సరిగ్గా సంపాదించింది మళ్లీ లాభాల బాటలోకి రావాలని కోరుకుందాం.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus