నన్ను జనాలు ఒక యాక్టర్ లా గుర్తుపట్టాలి, అదే నా ధ్యేయం: ఆనంద్
July 8, 2019 / 12:21 PM IST
|Follow Us
ఇండస్ట్రీకి వారసులు కొత్త కాదు, చిరంజీవి ఫ్యామిలీ నుంచే ఒక క్రికెట్ టీం కి సరిపడా హీరోలున్నారు. ఇక అక్కినేని, నందమూరి, ఘట్టమనేని కుటుంబాల నుంచి కూడా నట వారసులు వస్తూనే ఉన్నారు. ఈ వారసుల జాబితాలో రీసెంట్ గా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా చేరాడు. ఆనంద్ దేవరకొండ పరిచయ చిత్రం “దొరసాని” ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం ఘనంగా జరిగింది. రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక కథానాయికగా నటించిన ఈ చిత్రం పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా గురించి, సినిమాకి పనిచేసిన, సినిమాలో నటించినవారి గురించి అందరూ తెగ పొగిడేశారు కానీ.. అందరి కంటే బాగా మాట్లాడి ఆకట్టుకొన్నది మాత్రం ఆనంద్ దేవరకొండ.
తన జర్నీ, కష్ట కాలంలో తాను అమెరికాలో ఉండి తన ఫ్యామిలీకి అందించిన సపోర్ట్ ను ఆనంద్ చాలా చిన్న పనిగా చెప్పుకోవడం దేవరకొండ ఫ్యాన్స్ ను మాత్రమే కాదు.. యావత్ ఇండస్ట్రీ చేత కన్నీరు పెట్టించింది. ఆనంద్ పెద్ద హీరో అవుతాడా లేదా అనేది ఎలాగూ జూలై 12న తెలిసిపోతుంది. కానీ.. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. “నాకు విజయ్ దేవరకొండ తమ్ముడు అనే ట్యాగ్ వద్దు.. ఆడియన్స్ నన్ను ఒక యాక్టర్ గా, ఇంకా చెప్పాలంటే దొరసాని సినిమాలో రాజులా గుర్తుపెట్టుకోవాలి” అని చెప్పడం అభినందనీయం.