‘దేవి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల పరిచయమైన వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. ఎందుకంటే.. ఈ సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పటికే ఈమె రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. మొదటి రెండు పెళ్లిళ్లు మనస్పర్థలు రావడం వల్లనే ఫెయిల్ అయ్యాయి.. అని ఆమెనే స్వయంగా చెప్పుకొచ్చింది. అందుకే విడాకులు తీసుకున్నట్టు కూడా తెలిపింది. సరే ఇదంతా పక్కన పెట్టేసినా.. ఇటీవల ఈమె 3వ పెళ్లి చేసుకుంది.
ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ అయిన పీటర్ పాల్ ను వనిత 40 ఏళ్ళ వయసులో కూడా 3వ పెళ్లి చేసుకుంది. అయితే పెళ్ళైన 24 గంటల లోపే పీటర్ మొదటి భార్య … ‘నాకు విడాకులు ఇవ్వకుండానే.. పీటర్.. వనిత ను రెండో పెళ్లి చేసుకున్నాడని, ఈ విషయంలో నేను కోర్టుకు వెళ్తానని’ ఆమె నిరసనకు దిగింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం… కేసు కూడా పీటర్ రెండో భార్య అయిన ఎలిజబెత్ అనుకూలంగా నడిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట.
వనిత కు ఏమాత్రం పాజిటివ్ గా మారే అవకాశాలు కనిపించడం లేదట. ‘కావాలనే నన్ను కొందరు టార్గెట్ చేసి ఇలా ఇరికిస్తున్నారు’ అని వనిత తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టు తెలుస్తుంది. భారీగా వనిత ఎలిజబెత్ కు భరణం ఇప్పిస్తే తప్ప … ఆ మేటర్ తేలేలా లేదని సమాచారం. దీనిని బట్టి చూస్తుంటే… వనిత మూడో పెళ్ళి కూడా నిలబడే అవకాశం లేదని తెలుస్తుంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
Most Recommended Video
ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!