నాగ శౌర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’. ‘కార్తికేయ2’ ‘ధమాకా’ వంటి రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ నుండి వచ్చిన ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించగా శ్రీనివాస్ అవసరాల ఓ కీలక పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించాడు. టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ ఈ చిత్రాన్ని నిర్మించగా.. సహ నిర్మాతగా వివేక్ కూచిభొట్ల వ్యవహరించారు.
నాగశౌర్య-అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘ఊహలు గుసగుస లాడే’, ‘జో అచ్యుతానంద’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ చిత్రం పై ఓ వర్గం ప్రేక్షకుల దృష్టి పడింది.కానీ మొదటిరోజు నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఏమాత్రం ఆశాజనకంగా లేవనే చెప్పాలి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.20 cr |
సీడెడ్ | 0.08 cr |
ఆంధ్ర | 0.21 cr |
ఏపీ + తెలంగాణ | 0.49 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.06 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 0.55 cr |
‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ చిత్రానికి రూ.5.14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ మొదటి రోజు ఈ మూవీ కేవలం రూ.0.55 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకో రూ.4.85 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్