Shah Rukh Khan: షారూక్ కి నోటీసులు జారీ చేసిన పోలీసులు!
June 1, 2022 / 12:39 PM IST
|Follow Us
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఆయన ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే ఈ మధ్యకాలంలో షారుక్ ఖాన్ తన కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో భాగంగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అయితే ఆర్యన్ ఖాన్ ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా పోలీసులు మరోసారి షారుక్ ఖాన్ కి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ముంబైలో షారుక్ ఖాన్ నివసిస్తున్న అటువంటి మన్నత్ అంటే తనకు ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తన ఇంటిని మరమ్మతులను చేస్తూ ఎంతో అందంగా తీర్చి దిద్దుతూ ఉంటారు.ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ ఇంటి నేమ్ ప్లేట్ కోసం సుమారు 25 లక్షలు ఖర్చు చేసి ప్రత్యేకంగా తన భార్య గౌరీ ఖాన్ చేతన్ డిజైన్ చేయించారు.ఈ క్రమంలోనే ఇంటి నేమ్ బోర్డు కోసం 25 లక్షలు ఖర్చు పెట్టడంతో ఒక్క సారిగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంటి నేమ్ బోర్డ్ తయారు చేయడం కోసం ఉపయోగించిన స్పెషల్ స్టోన్ యూరప్ నుంచి తెప్పించారట.ఇది ఎంతో ఖరీదైనది కావడంతో దీనిని దొంగలు దొంగతనం చేసే అవకాశం కూడా ఉందని పోలీసులు బోర్డు కోసం కాపలా ఉన్నారు. పోలీసులకు ఈ నేమ్ ప్లేట్ కాపాడటం కాస్త కష్టతరంగా భావించడంతో షారుక్ ఖాన్ కి పోలీసులు నోటీసులు జారీ చేస్తూ తక్షణమే తన ఇంటికి ఉన్నటువంటి ఖరీదైన నేమ్ బోర్డు తొలగించాలని సూచించారట.
అలా తొలగించని పక్షంలో పోలీసులు స్వయంగా నేమ్ బోర్డ్ తొలగిస్తారని నోటీసు ద్వారా సూచించడంతో షారుక్ ఖాన్ చేసేదేమీ లేక తన ఇంటి నేమ్ బోర్డు తొలగించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇంటి నేమ్ బోర్డు కోసం 25 లక్షలు ఖర్చు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.