Anil Viswanath: చిరంజీవి ఆ మాట చెబితే చాలు.. పొలిమేర2 డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

  • November 15, 2023 / 07:40 PM IST

మా ఊరి పొలిమేర2 సినిమా చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ బాల్యం నుంచి నేను మెగాస్టార్ అభిమానినని ఆయన చెప్పుకొచ్చారు. నన్ను మించిన ఫ్యాన్ చిరంజీవికి ఉండరేమో అని ఆయన చెప్పుకొచ్చారు.

చిరంజీవి అంటే నాకు చెప్పలేని స్థాయిలో అభిమానం అని నేను దర్శకత్వం చేసిన సినిమాను చిరంజీవి గారు చూసి బాగుందని అభినందిస్తే చాలని అనిల్ విశ్వనాథ్ కామెంట్లు చేశారు. ఆ మాటతోనే సినిమాలు చేయడం ఆపేస్తానని అనిల్ విశ్వనాథ్ చెప్పుకొచ్చారు. అది నాకు ఒక అచీవ్ మెంట్ అని నాకు ఈ గౌరవం దక్కితే చాలని అనిల్ విశ్వనాథ్ కామెంట్లు చేశారు.

నాకు ఏ అవార్డులు, రివార్డులు వద్దని (Anil Viswanath) అనిల్ విశ్వనాథ్ అన్నారు. ఆ సమయంలో చిరంజీవి గారు గ్యారంటీగా పిలుచుకుని అభినందిస్తారని ఆ నమ్మకం నాకు ఉందని అనిల్ విశ్వనాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేస్తానని డైరెక్టర్ అనేవాడు షూటింగ్ సమయంలో ఏది బాగుందో ఏది బాలేదో చెప్పాలని కామెంట్లు చేయడం గమనార్హం.

చిరంజీవి గారి విషయంలో ఆయన ఏది చేసినా నచ్చుతుందని అందువల్ల ఆయన సినిమాకు నేను డైరెక్టర్ గా వ్యవహరించాలని అనుకోవడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రీజన్ వల్ల చిరంజీవి ఛాన్స్ ఇచ్చినా నో చెబుతానని అనిల్ విశ్వనాథ్ తెలిపారు. చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ సినిమాను 70సార్లు చూశానని చిరంజీవి సినిమా అంటే అంత ఇష్టమని ఆయన తెలిపారు. అనిల్ విశ్వనాథ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus