Polimera3: ఈసారి ‘గీతా ఆర్ట్స్’ సంస్థ రంగంలోకి దిగుతుందట..!

  • November 15, 2023 / 11:28 AM IST

2021 లాక్ డౌన్ టైంలో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి వరకు అలాంటి ఓ సినిమా వస్తుందని కూడా జనాలకి తెలీదు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శీను వంటి వారు నటించిన అతి చిన్న సినిమా ఇది. అయినప్పటికీ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది. క్లైమాక్స్ కి అందరూ ఫిదా అయ్యారు.

అయితే దీనికి ‘పార్ట్ 2’ గా ఇటీవల ‘మా ఊరి పొలిమేర 2’ వచ్చింది. ఈసారి థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని విధంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కేవలం రూ.4 కోట్లు మాత్రమే. అయినప్పటికీ థియేటర్లలో ఈ చిత్రం రూ.8 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ సాయంతో వంశీ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. ఓటీటీ డీల్ కూడా ఫైనల్ అయిపోయింది.

ఫ్యాన్సీ రేటుకు డిజిటల్ హక్కులు విక్రయించినట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘పొలిమేర 3’ కూడా ఉంటుందని దర్శకుడు ముందుగానే ప్రకటించాడు. క్లైమాక్స్ లో కూడా దానికి సంబంధించిన హింట్ ఇచ్చారు. కాకపోతే ఈసారి నిర్మాత గౌరీ కృష్ణని పక్కన పెట్టేసి కంప్లీట్ గా ‘గీతా ఆర్ట్స్’ సంస్థ నిర్మించుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి రూ.15 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి గ్రాండ్ గా (Polimera3) ‘పొలిమేర 3’ ని రూపొందించాలని ‘గీతా’ సంస్థ రెడీ అయినట్లు తెలుస్తుంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus