Trisha: స్టార్ హీరోయిన్ త్రిష పై రాజకీయ నాయకుడి విమర్శలు… ఆమె రిప్లై ఏంటంటే?
February 21, 2024 / 02:27 PM IST
|Follow Us
ప్రముఖ కథానాయిక త్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్లు, ఆ తర్వాత పరిణామాలు, కోర్టు కేసులు… ఇప్పుడిప్పుడే ఈ విషయం సద్దుమణిగింది, జనాలు మరచిపోతున్నారు అనుకుంటుండగా… మరోసారి ఆమె మీద పరువు నష్టం వ్యాఖ్యలు మొదలయ్యాయి. ఈ సారి ఓ రాజకీయ నాయకుడు ఈ మేరకు కామెంట్లు చేశారు. అన్నాడీఎంకే నుండి ఇటీవల ఉద్వాసనకు గురైన సేలం వెస్ట్ యూనియన్ సెక్రటరీ ఏవీ రాజు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
అన్నాడీఎంకే ఆధిపత్య పోరులో భాగంగా 2017లో కొంతమంది ఎమ్మెల్యేలను ఏవీ రాజు కౌయంతుర్‌లోని రిసార్ట్‌లో ఉంచారు. దీనికి సంబంధించి ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఏవీ రాజు. దీంతో తమిళనాట రాజకీయల్లో అవి దుమారం రేపాయి. జయలలిత మరణానంతరం అధికారంలోకి వచ్చిన వీకే శశికళ నేతృత్వంలోని అన్నాడీఎంకే నాయకత్వం ఎమ్మెల్యేలు వర్గం మారకుండా ఉండేందుకు తిరుగుబాటు నేత ఓ పన్నీర్‌సెల్వంతో కలిసి అనేక పథకాలు రచించారని ఏవీ రాజు ఆరోపించారు.
ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు మొత్తం ఎమ్మెల్యేలను కలిసి ఉంచేందుకు నటి త్రిషను చెన్నైలోని కౌయంతుర్‌లోని బీచ్ సైడ్ రిసార్ట్‌లోని రిసార్ట్‌కు తీసుకువచ్చినట్లు ఏవీ రాజు చెప్పారు. రూ.25 లక్షలు చెల్లిస్తామని ఆమెను పిలిచారు అని కూడా మాట్లాడాడు. దీంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఎమ్మెల్యే జి.వెంకటాచలాన్ని లక్ష్యంగా చేసుకుని ఏవీ రాజు అలా మాట్లాడారు అని సమాచారం. ఈ వ్యాఖ్యలపై త్రిష (Trisha) కూడా స్పందించింది.
పబ్లిసిటీ కోసం కొందరు రాజకీయ నేతలు పనిగట్టుకొని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఇలాంటి వాళ్లను చూస్తుంటే అసహ్యంగా ఉందని కామెంట్ చేసింది. ఏవీ రాజు వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని త్రిష డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ‘త్రిష.. మీకు మేం ఉన్నాం’ అంటూ పలువురు సినీ తారలు మద్దతు ఇచ్చారు. ఇలా అసభ్యకరంగా కామెంట్లు చేయడం అమోదయోగ్యం కాదని విశాల్ ఖండించాడు. ప్రభుత్వం వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.