పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సీన్ అయిపోయింది. దాదాపుగా కలెక్షన్స్ అన్నీ క్లోస్ అయిపోయాయి. సోషియల్ నెట్వర్కింగ్ సైట్స్ లో టాప్ 4 సినిమాల్లో సర్దార్ ఒకటి అని ఆయన వీరాభిమానులు చెప్పుకుంటూ, సర్దుకుపోవడం మినహా, అక్కడ పెద్దగా వస్తుంది ఏమీ లేదు. ఇదిలా ఉంటే మరో పక్క ఈ సినిమా ఫేల్యూర్ ను ఎక్కడా మైండ్ లో పెట్టుకోకుండా పవన్ 2019 ఎన్నికలకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ప్రెస్ మీట్స్, పత్రికలకు, టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూస్ ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న పవన్ రానున్న ఎన్నికల్లో తన అజెండా వెల్లడించాడు కాబట్టి, ఇప్పటి నుంచే టీడీపీ పవన్ పై అస్త్రాలు సందించేందుకు సర్వం సిద్దం చేసుకుంటుంది. అందులో భాగంగా, పవన్ పై నెగిటివ్ ప్రచారాన్ని మొదలు పెట్టి ప్రజల్లోకి తీసుకువెళ్ళి, ప్రజలకు పవన్ నిజస్వరూపాన్ని వివరించాలనే ఆలోచనతో పవన్ పై సందించే అస్త్రం అదే, ప్రజల్లో చరిష్మా ఉన్న హీరో కోసం వెతుకుతున్న తరుణంలో టీడీపీలో ఒక వర్గం ప్రిన్స్ మహేష్ పేరును పైకి తెచ్చింది. అయితే మహేష్ బాబు స్వభావ రీత్యా ఎవరితోనూ డైరెక్ట్ ఫైట్ కు రాడు కాబట్టి పవన్ కట్టడి చేసే శక్తి మహేష్ కు లేదు అన్న కామెంట్స్ సైతం వినిపిస్తూ ఉండడంతో, ఇప్పుడు మళ్లీ ఆ స్థానాన్ని ఎన్టీఆర్ తో నింపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుగుదేశం లో ఒక వర్గం భావిస్తుంది. యూత్ లో చొచ్చుకు పోగల ఇమేజ్ జూనియర్ ఎన్టీఆర్ కు ఉంది కాబట్టి ఏదో విధంగా నందమూరి కుటుంబంలో ఏర్పడ్డ విభేదాలను పరిష్కరించి రాబోతున్న పరిస్థితులను ముందే ఊహించి జూనియర్ ను వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచే దారిలోకి తెచ్చు కోవడం చాల మంచిది అన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తూ ఉండడంతో మళ్లీ ఎన్టీఆర్ అవసరం పార్టీకి ఏర్పడింది అని, ఎన్టీఆర్ ఈజ్ బ్యాక్ అంటూ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి దీనిపై బాబు ఏమంటారో చూడాలి.