PS1: ‘పొన్నియన్ సెల్వన్ – 1’ (తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
September 30, 2022 / 05:04 PM IST
|Follow Us
ఇండియన్ సినిమా గర్వించదగ్గ ఫిలిం మేకర్స్ లో మణిరత్నం కూడా ఒకరు. 4 దశాబ్దాలుగా ఆయన తెరకెక్కించాలని కలలు కంటూ చివరికి నానా తిప్పలు పడి తీసిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. దీని మొదటి భాగాన్ని ‘పీఎస్-1’ గా సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు. టీజర్, ట్రైలర్ వంటివి పర్వాలేదు అనిపించడంతో సినిమా పై బజ్ ఏర్పడింది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు కలిసి ఎంతో ప్రెస్టీజియస్ గా ఈ ప్రాజెక్టుని రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా నిర్మించారు.
తమిళ్ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏక కాలంలో విడుదల కాబోతుంది ఈ మూవీ. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తిబన్, ప్రకాష్‌రాజ్ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉండడం కూడా ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడడానికి కారణం అని చెప్పొచ్చు. అందుకే తెలుగులో ఈ మూవీకి పర్వాలేదు అనిపించే విధంగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :
నైజాం
2.20 cr
సీడెడ్
1.85 cr
ఉత్తరాంధ్ర
1.10 cr
ఈస్ట్
0.36 cr
వెస్ట్
0.32 cr
గుంటూరు
0.60 cr
కృష్ణా
0.75 cr
నెల్లూరు
0.30 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
8.48 cr
‘పొన్నియన్ సెల్వన్ – 1’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.8.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదు అనిపిస్తున్నాయి. టాక్ కనుక పాజిటివ్ గా వస్తే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.