Ponniyin Selvan2: ‘పొన్నియిన్ సెల్వన్ 2’ వచ్చేసింది.. చూడాలంటే చిన్న షరతు!
May 26, 2023 / 04:24 PM IST
|Follow Us
ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోదు.. అప్పుడప్పుడు అద్దె కూడా కట్టాలి. అప్పుడే సినిమా చూడగలం. ఏంటీ బర్నింగ్ టాపిక్ గురించి మళ్లీ మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా? ఎందకంటే మరోసారి అద్దె సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. సబ్‌స్క్రిప్షన్‌తో సంబంధం లేకుండా అద్దె చెల్లించి చూడండి అంటూ ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చారు. థియేటర్లలో చూడనివాళ్లు ఇక్కడ టికెట్ తీసుకుని సినిమా చూడాలన్నమాట. ఆ తర్వాత ఎప్పుడో నేరుగా రిలీజ్ చేస్తారన్నమాట.
మణిరత్నం కలల ప్రాజెక్ట్‌గా రూపొందిన చారిత్రక యాక్షన్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అయితే తమిళనాట మాత్రం అదిరిపోయే విజయాలను అందుకుంది. ఏప్రిల్ 28న ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.అద్దె ప్రాతిపదికన ఈ సినిమాలను . అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో సంబంధం లేకుండా రూ.399 చెల్లించి చూడాలన్నమాట.
ఒకసారి రెంట్ చెల్లించి సినిమా చూడటం మొదలు పెట్టిన తర్వాత 48 గంటల్లో పూర్తి చేయాలి. ఆ తర్వాత రెంట్ టైమ్ ముగిసిపోతుంది. మళ్లీ చూడాలి అనుకుంటే.. మళ్లీ రెంట్ చెల్లించాలన్నమాట. గతంలోనూ ఇలా కొన్ని సినిమాలు అందుబాటులోకి వచ్చినప్పుడు విమర్శలు వచ్చాయి. సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక మళ్లీ ఇదేంటి అని అన్నారు. అయితే ఇలా సినిమాలు వచ్చినప్పుడు వాటికి అంత ఆదరణ ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి.
అయినా పెద్ద సినిమాల నిర్మాతలు దీన్ని కొనసాగిస్తున్నారు. (Ponniyin Selvan2) ‘పొన్నియిన్ సెల్వన్ 2’ కథ సంగతి చూస్తే.. చోళ యువరాజు అరుణ్మొళి వర్మ అలియాస్ పొన్నియిన్ సెల్వన్ ఎప్పుడు ఆపద వచ్చినా కాపాడే ఓ వృద్ధురాలు రెండో పార్టులో అతని కోసం సముద్రంలో ప్రత్యక్షమవుతుంది.
నందిని (ఐశ్వర్యరాయ్) పోలికలతో కనిపించే ఆ వృద్ధురాలు ఎవరు? ఈసారి ఆపద నుండి అరుణ్మొళిని ఆమె కాపాడిందా లేదా? వీరపాండ్య హత్యకు ప్రతీకారంగా చోళ రాజుల్ని అంతం చేయడమే లక్ష్యంగా వేచి చూస్తున్న పాండ్య సైన్యం లక్ష్యం నెరవేరిందా? తనపై మనసుపడిన ఆదిత్య కరికాలుడు (విక్రమ్)ని వ్యూహం ప్రకారం తన కోటకి రప్పించిన నందిని ఏం చేసింది? అసలు 9వ శతకంలో చోళ సామ్రాజ్యంలో ఏం జరిగింది అనే ఈ రెండో భాగం కథ.