Pooja Hegde: ఆ హీరోలకు పూజా హెగ్డే దూరమైనట్టేనా?

  • September 22, 2021 / 02:30 PM IST

తెలుగుతో పాటు తమిళం, హిందీ ఆఫర్లతో పూజా హెగ్డే బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు కాగా పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్ సినిమాల షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో, పవన్ హరీష్ కాంబో మూవీలో పూజా హెగ్డే నటిస్తున్నారని సమాచారం. తమిళంలో పూజా హెగ్డే చేతిలో బీస్ట్ సినిమా ఉంది.

అయితే ఈ స్టార్ హీరోయిన్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని సమాచారం. మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు సైతం పూజా హెగ్డే నో చెబుతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలో కూడా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఐకాన్ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. ఇప్పటికే డీజే, అల వైకుంఠపురములో సినిమాల్లో అల్లు అర్జున్, పూజా హెగ్డే కలిసి నటించారు.

నితిన్ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను మేకర్స్ సంప్రదించగా ఆ ఆఫర్ కు పూజ నో చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో పూజా హెగ్డే పలువురు మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం వల్ల కథ నచ్చినా పూజా హెగ్డే ఓకే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పొడుగు కాళ్ల సుందరిగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే ఒక్కో సినిమాకు 4 నుంచి 5 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus