పూజా హెగ్డే…బాలీవుడ్ లో హ్రిత్రిక్ రోషన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే, ఆ తరువాత తెలుగులో సైతం అడుగు పెట్టింది. అయితే ఐరన్ లెగ్ గా ముద్రపడి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న పూజాకి ఎండమావి లో స్విమ్మింగ్ పూల్ లాగా బన్నీ దువ్వాడ జగన్నాధం సినిమా అవకాశం దొరికింది. అయితే అదే క్రమంలో ఆ సినిమాలో నటించడం ఎంత అదృష్టమో, అంత టార్చర్ అంటుంది పూజా. అసలు విషయం ఏంటి అంటే బన్నీ సినిమా అంటే మిగిలినవి ఎలా ఉన్నా, డ్యాన్స్ విషయంలో మాత్రం హీరోయిన్స్ కాస్త కష్టపడాలి అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే విషయం పూజా ఒక ఫోటో ద్వారా షేర్ చేస్తూ బన్నీ డ్యాన్స్ విషయంలో తనని టార్చర్ పెడుతున్నాడు అంటూ శెటైర్స్ వేస్తుంది. ఒక పక్క ఇప్పటికే ఈ సినిమాలో పూజ హెగ్డే గ్లామర్ షో మోతాదుకు మించి ఉంది అని వార్తలు వస్తున్న క్రమంలో, దీనికితోడు ఈమూవీలోని పాటలకు బన్నీతో పోటీపడి స్టెప్స్ వేయడానికి పూజ నానా కష్టాలు పడిందట.
ఆ కష్టాల గురించే అమ్మడు ఒక ఫోటో ద్వారా ట్విటర్ లో తన అనుభవాన్ని తెలిపింది. ఇక మరో పక్క ఆ పాట ఏంటి అంటే ‘గుడిలో ఒడిలో బడిలో’ పాట. ఈపాట కోసం బన్నీతో పోటీపడి నటించడానికి పూజ హెగ్డే చాల కష్టపడి చెమటలు పట్టేలా స్టెప్స్ వేసాను అంటోంది. అంతేకాదు పూజ ఈ పాట కోసం రిహార్సల్స్ చేస్తూ ఉంటే బన్నీ మాత్రం తనకు ఏమి పట్టనట్లుగా ఒక కుర్చీలో దర్జాగా కూర్చుని పూజ హెగ్డే చేత రిహార్సల్స్ చేయిస్తున్న ఫోటోను తన ట్విటర్ లో షేర్ చేసింది పూజ. మొత్తంగా తెలుగు సినిమాల్లో యాక్టింగ్ అంటే పాపం మిగిలిన ఇండస్ట్రీస్ లో లాగా ఉంటుంది అనుకుంది ఈ అమ్మడు బన్నీ మొత్తం పిండేసి టాలీవుడ్ తఢాకా ఏంటో చూపించాడు అంటున్నారు బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.