పూజా రామచంద్రన్ కు మగబిడ్డ.. అప్పుడే పేరు కూడా పెట్టేసింది.!

  • April 30, 2023 / 03:47 PM IST

‘బిగ్ బాస్’ బ్యూటీ పూజా రామచంద్రన్ అందరికీ సుపరిచితమే. ‘లవ్ ఫెయిల్యూర్’, ‘స్వామి రారా’, ‘దోచేయ్’, ‘గంగ’,’కృష్ణార్జున యుద్ధం’, ‘త్రిపుర’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె.. అటు తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ‘బిగ్ బాస్ 2′(తెలుగు)తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సీజన్లో ఆమె వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి.. కొద్దిరోజులు మాత్రమే హౌస్ లో ఉండగలిగింది. ఈమె పెళ్లి వార్తలు కూడా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

మొదట విజె క్రేప్గ్ ను 2010 లో పెళ్లి చేసుకున్న ఈమె.. తర్వాత మనస్పర్థల కారణంగా అతనితో విడిపోయింది. అటు తర్వాత 2019 లో విలన్ పాత్రలు చేసే జాన్ కొక్కెన్ ను పెళ్లి చేసుకుంది.‘సార్పట్ట’ విలన్ గా ఇతను బాగా పాపులర్. ఇతను కూడా మొదట వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని విడిపోయాడు. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. పూజా రామచంద్రన్ ప్రెగ్నెంట్ అయిన సంగతిని తెలియజేసి ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.

2022 నవంబర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. తాజాగా ఈమెకు డెలివరీ అవ్వడం కూడా జరిగింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది పూజా. ఈ విషయాన్ని ఆమె భర్త జాన్ కొక్కెన్ ప్రకటించాడు. అంతేకాదు ఆ బిడ్డకు వీరు పేరు కూడా పెట్టినట్టు ప్రకటించాడు. పూజా- జాన్ ల బేబీకి.. కియాన్ కొక్కెన్ అంటూ పేరు పెట్టినట్లు ఈ సందర్భంగా తెలియజేశాడు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus