లిప్ లాక్స్ పెట్టుకుంటూ మరీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన పూజా రామచంద్రన్!
November 13, 2022 / 10:42 AM IST
|Follow Us
లవ్ ఫెయిల్యూర్, స్వామి రారా, దోచేయ్, గంగ,కృష్ణార్జున యుద్ధం, త్రిపుర వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పూజా రామచంద్రన్ ఆ తర్వాత ‘బిగ్ బాస్ 2′(తెలుగు)తో ప్రేక్షకులకి మరింత దగ్గరైంది.ఈమె పర్సనల్ లైఫ్ కూడా అందరికీ సుపరిచితమే. విజె క్రేప్గ్ ను 2010 లో పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ళు కొన్ని కారణాల వల్ల 2017లో విడిపోయారు. అయితే జాన్ కొక్కెన్ అనే తమిళ నటుడిని ప్రేమించి 2019 లో పెళ్లి చేసుకుంది. జాన్ సినిమాల్లో ఎక్కువగా విలన్ గా, నెగిటివ్ రోల్స్ లో కనిపిస్తాడు.
‘సార్పట్ట’ సినిమాలో ఆర్యకు పోటీదారుడు పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. జాన్ కూడా పూజా కంటే ముందు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇతను కూడా కొన్ని కారణాల వల్ల తన మొదటి భార్యతో విడిపోయాడు. ఇదిలా ఉండగా.. పూజా రామచంద్రన్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అట. త్వరలో తల్లి కాబోతున్నట్లు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది, ఈ విషయాన్ని ఆమె బాలీవుడ్ స్టైల్ లో భర్తకు లిప్ లాక్ ఇస్తూ ఈ విషయాన్ని బోల్డ్ గా తెలియజేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
పూజకి కొంతమంది కంగ్రాట్స్ చెబుతుంటే మరికొంత మంది అయితే అలాంటి గొప్ప విషయాన్ని చెబుతూ ఇలాంటి ఫోటోలను షేర్ చేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ఈ రకంగా ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :