Poonam Kaur, Pawan Kalyan: ‘భీమ్లా నాయక్’ మూవీ పై పూనమ్ పోస్ట్ వైరల్..!

  • February 25, 2022 / 09:49 PM IST

పూనమ్ కౌర్.. గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టింది. కానీ అంతగా క్లిక్ అవ్వలేదు. తర్వాత సెకండ్ హీరోయిన్ అయ్యింది అలా కూడా క్లిక్ అవ్వలేదు. చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది అలా కూడా నిలబడలేకపోయింది. ఈమెకు ఉన్న ఫేస్ వాల్యూకి కచ్చితంగా మంచి హీరోయిన్ అవ్వాల్సింది. లోపం ఎక్కడ జరిగిందో తెలీదు ఆశించిన రీతిలో ఈమె సినీ కెరీర్ సాగలేదు.

Click Here To Watch

అయితే పవన్- త్రివిక్రమ్ ల పై పరోక్షంగా సెటైర్లు వేస్తూ ఎప్పటికప్పుడు తన ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతుంటుంది ఈ అమ్మడు. సమంత తో నాగ చైతన్య విడాకులు ప్రకటించినప్పుడు సిద్దార్థ్ ‘చీటర్స్… ‘ అంటూ ఓ పోస్ట్ పెడితే.. దానికి పూనమ్ ఇన్వాల్వ్ అయ్యి ‘నిజం’ అంటూ కామెంట్ చేసింది. ఇప్పుడు మరోసారి పవన్ సినిమా గురించి ఈమె పరోక్షంగా ఓ పోస్ట్ పెట్టింది. మ్యాడీ అనే వ్యక్తితో ఈమె జరిపిన వాట్సాప్ చాట్ ను షేర్ చేసింది.

అందులో మ్యాడీ అనే వ్యక్తి ‘అక్కా.. బావ సినిమాకి వచ్చాను అంటూ మెసేజ్ పెట్టాడు. అటు తర్వాత సినిమా ఎలా ఉంది? నిజాయితీగా చెప్పు అంటూ రిప్లై ఇచ్చింది. దానికి ఆ వ్యక్తి ‘బావ సినిమా హిట్టు అక్కా.. నిజం నమ్ము’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇది ‘భీమ్లా నాయక్’ సినిమాని ఉద్దేశించే అని నెటిజన్లు చర్చలు జరుపుతున్నారు. పరోక్షంగా అది నిజమే కానీ.. దానిని ఒప్పుకోని కొంతమంది పవన్ అభిమానులు విరుచుకుపడుతుండడాన్ని కూడా మనం గమనించవచ్చు.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus