Poonam Kaur: చంద్రబాబు అరెస్ట్ కావడం బాధగా ఉంది.. పూనమ్ కామెంట్స్ వైరల్!

  • October 23, 2023 / 05:06 PM IST

చంద్రబాబు స్కిల్ డెవలప్ స్కాంలో భాగంగా అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయనను సెప్టెంబర్ 9వ తేదీన సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటినుంచి ఈయన రాజమండ్రి జైలులోనే ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో చాలామంది అరెస్టును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలియజేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో బైయిలు కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయన రిమాండ్ పొడుస్తూనే ఉన్నారు.

ఈ విధంగా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఎంతోమంది నిరసనలు వ్యక్తం చేశారు. ఇక సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వారు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను వ్యతిరేకించారు. ఇండస్ట్రీకి చెందినటువంటి పలువురు సీనియర్ ప్రొడ్యూసర్లు ఈ విషయం గురించి మాట్లాడుతూ బాబు నాయుడు అరెస్ట్ కేవలం కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలియజేశారు.

ఇక నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) కూడా గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఈ వయసులో అరెస్టు చేయడం భావ్యం కాదని మాట్లాడారు అయితే తాజాగా ఈమె దేవీ నవరాత్రులను పురస్కరించుకొని విజయవాడకు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇలా అమ్మవారి దర్శనం అనంతరం ఈమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విడుదల కావాలని తాను అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించానని తెలిపారు.

చంద్రబాబు నాయుడుని ఈ వయసులో అరెస్టు చేయడం తనకు చాలా బాధ కలిగిందని ఆయన వెంటనే విడుదల కావాలని నేను కోరుకున్నాను అంటూ ఈ సందర్భంగా ఈమె చంద్రబాబు నాయుడు విడుదల గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె నటించింది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ ఇలా సినిమాలకు రాజకీయాలకు సంబందించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు ద్వారా పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తూ పాపులారిటీ సంపాదించుకున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus