Poonam Kaur: పవన్ అంబటి వివాదం గురించి పూనమ్ కౌర్ అలా కామెంట్ చేశారా?

  • August 3, 2023 / 01:39 PM IST

తెలుగులో సినిమాల కంటే వివాదాల ద్వారా పాపులర్ అయిన వాళ్లలో పూనమ్ కౌర్ ఒకరు. ట్విట్టర్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. సోషల్ మీడియాలో తను వేసే ట్వీట్ల ద్వారా పూనమ్ కౌర్ హాట్ టాపిక్ అవుతుంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ అంబటి మధ్య వివాదం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.

బ్రో మూవీలో శ్యామ్ బాబు పాత్ర వల్ల పవన్, అంబటి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అయితే పవన్ అంబటి వివాదం గురించి పూనమ్ కౌర్ స్పందిస్తూ ప్రస్తుతం రాజకీయాలు వినోదానికి కేరాఫ్ అడ్రస్ అవుతుండగా ప్రేక్షకులకు వినోదం అందించాల్సిన సినిమాలు మాత్రం సీరియస్ గా మారిపోయాయని ఇది కేవలం నా ఆలోచన మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. పూనమ్ కౌర్ (Poonam Kaur) చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఎవరికీ సపోర్ట్ చేయకుండానే పూనమ్ కౌర్ తనదైన శైలిలో పంచ్ లు పేల్చారు. ఆమె డైరెక్ట్ గా బ్రో సినిమా గురించి ట్వీట్ చేశానని చెప్పకపోయినా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి అవగాహన ఉన్నవాళ్లకు ఈ విషయం సులభంగానే అర్థమవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రో మూవీ వివాదం విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బ్రో సినిమా కథ, కథనం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా పవన్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచేదని అదే సమయంలో కలెక్షన్లు మరింత పెరిగేవని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. బ్రో మూవీ ఫుల్ రన్ కలెక్షన్ల గురించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus