Poorna: ‘చమ్కీల అంగీలేసి’ పాటకు బేబీ బంప్‌తో పూర్ణ డ్యాన్స్!.. వైరల్ అవుతున్న వీడియో..!

  • April 1, 2023 / 04:05 PM IST

‘చమ్కీల అంగీలేసీ ఓ వదినే’.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడవిన్నా ఇదే పాట.. యూత్ చార్ట్ బస్టర్‌గా నిలవడమే కాక.. అందరి మొబైల్స్‌లోనూ ఈ సూపర్ హిట్ సాంగే వినిపిస్తుంది.. ఇక థియేటర్లలో ప్రేక్షకులు రచ్చ రంబోలా చేస్తున్నారు.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు రీల్స్ చేయగా.. రీసెంట్‌గా నటి పూర్ణ కూడా కాలు కదిపారు.. అది కూడా బేబీ బంప్‌తో డ్యాన్స్ చేయడం విశేషం.. ‘దసరా’ మూవీలో పూర్ణ నటించారు.. త్వరలో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు..

గతేడాది జూన్‌లో దుబాయ్ బేస్డ్ బిజినెస్‌మెన్ షానిద్ ఆసిఫ్ అలీతో ఆమె (Poorna) వివాహం జరిగిన సంగతి తెలిసిందే.. బేబి బంప్ నుంచి సీమంతం వరకూ తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన అన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్‌ని ఫ్యాన్స్, నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారామె.. ఇప్పుడు ‘చమ్కీల అంగీలేసి’ పాటకు తన స్టైల్లో బ్యూటిఫుల్ మూమెంట్స్ చేశారు.. పూర్ణ షేర్ చేసిన ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. ‘సూపర్.. టేక్ కేర్ పూర్ణ గారు’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు..


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus