కొద్దిరోజుల నుండీ టాలీవుడ్లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. వరుసగా సినీ సెలబ్రిటీలు మృత్యువాత పడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కు సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా మరణిస్తుండడం కలవరపరిచే విషయం.తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, నటుడు అయిన టి.నరసింహరావు(టీఎన్ఆర్) కరోనాతో మరణించారు. ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయిన ఈయన మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. టి.ఎన్.ఆర్ చేసే ఇంటర్వ్యూలు ఎక్కువ నిడివి కలిగి ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తుంటారు. ఈయన వాక్చాతుర్యం కూడా అలా ఉంటుంది.
అయితే ఈయన కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడడంతో మల్కాజ్ గిరి లోని ఓ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ.. శనివారం నుండీ ఈయన పరిస్థితి విషమించింది అని వార్తలు వచ్చాయి. ఇక ఈరోజు ఉదయం ఆయన చికిత్స పొందుతూనే కన్ను ముసినట్టు తెలుస్తుంది. జర్నలిస్ట్ గానే కాకుండా ఈయన నటుడుగా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. సుమంత్ హీరోగా వచ్చిన ‘బోణి’ చిత్రంలో ఈయన నటించారు.
అటు తరువాత ‘కల్కి’ ‘జార్జ్ రెడ్డి’ ‘నేనే రాజు నేనే మంత్రి’ ‘సుబ్రహ్మణ్యపురం’ ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ ‘హిట్’ ‘జాతి రత్నాలు’ ‘ఫలక్ నుమా దాస్’ వంటి సినిమాల్లో నటించారు. మొత్తం కలిపి టి.ఎన్.ఆర్ 50 సినిమాల్లో కనిపించారు. ఈయన మరణం టాలీవుడ్ ను విషాదంలోకి నెట్టేసింది అనే చెప్పాలి. నాని వంటి హీరోలు ఈయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!