Posani: నంది అవార్డులపై పోసాని సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
April 8, 2023 / 11:12 AM IST
|Follow Us
ప్రముఖ టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి ముక్కుసూటిగా మాట్లాడతారనే సంగతి తెలిసిందే. తాజాగా నంది అవార్డుల గురించి పోసాని సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ లో సినిమాలు చూసే అవకాశం కల్పిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. నంది అవార్డుల విషయంలో ఎన్నో అపోహలు ఉన్నాయని పోసాని పేర్కొన్నారు. కులాలు, గ్రూపుల వారీగా అవార్డులను పంచుకున్నారని పోసాని వెల్లడించారు.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అవార్డుల పంపిణీ ఈ విధంగా జరిగిందని పోసాని చెప్పుకొచ్చారు. ఏపీ ఫైబర్ నెట్ ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమంలో మాట్లాడుతూ పోసాని ఈ కామెంట్లు చేశారు. టెంపర్ సినిమాలోని నా రోల్ కు కర్మ కాలి అవార్డ్ వచ్చిందని పోసాని చెప్పుకొచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అవార్డ్ నాకు ఇచ్చారని ఆయన కామెంట్లు చేశారు. నేను ఆ అవార్డును తీసుకున్నానని పోసాని చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో ఒక వర్గానికి చెందిన 11 మంది అవార్డుల కమిటీలో ఉన్నారని పోసాని కామెంట్లు చేశారు. ఆ అవార్డ్స్ ఇచ్చిన తీరు నాకు నచ్చకపోవడంతో ఆ అవార్డులు వద్దని చెప్పానని ఆయన కామెంట్లు చేశారు. కులాలు, మతాలకు సంబంధం లేకుండా అవార్డులు ఇవ్వాలని పోసాని చెప్పుకొచ్చారు. తెలుగు ఇండస్ట్రీని శాసించేది డబ్బు మాత్రమేనని ఆయన తెలిపారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాత్రం పోసాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని అన్నారు.
పార్టీ పరంగా పోసాని (Posani) కామెంట్లు చేసి ఉండవచ్చని ప్రసన్న కుమార్ తెలిపారు. అవార్డుల కమిటీలో పరుచూరి బ్రదర్స్, జీవిత ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. పనితీరునే సినిమా ఇండస్ట్రీలో పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని ప్రసన్న కుమార్ వెల్లడించారు. పోసాని చేసిన కామెంట్లకు ఇండస్ట్రీకి చెందిన వాళ్ల నుంచి కౌంటర్లు వస్తున్నాయి.