పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా బ్రో మరో వారం రోజుల్లో రిలీజ్ కానుంది. బ్రో ప్రీ రిలీజ్ బిజినెస్ ఆకాశమే హద్దుగా జరుగుతుండగా రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో చరిత్ర సృష్టిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలకు అదనంగా మరో సినిమాకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది.
ఏపీలో 2024 ఎన్నికలకు మరో 9 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం చేస్తుండగా ఆయన ప్లానింగ్ అర్థం కావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పీపుల్స్ మీడియా బ్యానర్ లో పవన్ కొత్త సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ బ్యానర్ పవన్ కు సొంత బ్యానర్ లా మారిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పవన్ కొత్త సినిమాకు డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పారితోషికం 80 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ వేగంగా సినిమాలలో నటిస్తూ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రేంజ్ పెరుగుతుండగా పవన్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెడితే ఇతర భాషల్లో సైతం పవన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు