Prabhas: ఏపీలో ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా షూటింగ్‌.. అందుకేనా?

  • April 11, 2022 / 12:58 PM IST

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తీస్తున్న సినిమా నేపథ్యమేంటి? గత కొన్ని రోజులుగా ఈ విషయమ్మీద చర్చ జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుండి ఎలాంటి క్లారిటీ రావడం లేదు. అయితే సినిమా షూటింగ్‌లో కనిపించిన కొన్ని సీన్స్‌ బట్టి సినిమా కథ ఇదే అంటూ ఓ రూమర్‌ చక్కర్లు కొడుతోంది. షూటింగ్‌లో కనిపించింది అని చెబుతున్న వివరాల ప్రకారం అయితే ఈ సినిమాలో ప్రభాస్‌ సూపర్‌ హీరోగా కనిపిస్తాడు. అంటే ఆటోమేటిగ్గా సూపర్‌ పవర్స్‌ ఉంటాయి.

వైజయంతీ మూవీస్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన దీపికా పడుకొణె నటిస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా గురించి స్పష్టంగా తెలిసిన సమాచారం ఇదే. అయితే ‘ప్రాజెక్ట్‌ కె’ అనే పేరులో ఉన్న కె అనే అక్షరంతోనే సినిమా పేరు ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు సినిమాలో హీరో పేరు కూడా కె అనే అక్షరంతోనే అని టాక్‌. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ కొడుకుగా ప్రభాస్‌ కనిపిస్తాడనే పుకార్లు ఉన్నాయి. అంతేకాదు దీపిక అమితాబ్‌ శిష్యురాలిగా నటిస్తోందట.

ఇక తాజా అప్‌డేట్‌ సంగతి చూస్తే… ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగింది. సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారట. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామ సమీపంలో ఈ షూటింగ్‌ జరిగింది. పెన్నా నది తీరంలో ఇసుక తిన్నెల మధ్య షూటింగ్ చేశారట. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ లేడు. ఇతర నటీనటులపైనే సీన్స్‌ తీశారు. సుమారు 60 మంది షూట్‌లో పాల్గొన్నారట. అయితే ఆ సన్నివేశాల బట్టి సినిమా కథ అంచనా వేస్తున్నారు.

సినిమా షూటింగ్‌ సందర్భంగా లీక్‌ అయిన వీడియోల్లో నటులు సూపర్ హీరోల్లా కనిపిస్తున్నారు. చేతిలో వెరైటీ ఆయుధాలు ఉన్నాయి. మరికొంత మంది సాధారణ వ్యక్తుల్లా కనిపించారు. వారైతే స్పేస్ సూట్ లాంటి దుస్తుల్లో ఉన్నారట. ఈ లెక్కన సినిమా సూపర్‌ హీరోల నేపథ్యంలో ఉంటుందని చెప్పేస్తున్నారు. ప్రభాస్‌ కూడా షూట్‌కి వచ్చి ఉంటే ఇంకా క్లారిటీ వచ్చేది. అప్పటివరకు ఈ పుకార్లతో ప్రభాస్‌ లుక్‌ను ఊహించుకోవడమే.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus