మన తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీయస్ట్ ఫ్రెండ్స్ కాంబినేషన్ అంటే ప్రభాస్-గోపీచంద్ లు ముందు వరుసలో నిలుస్తారు. “వర్షం” సినిమాలో హీరో-విలన్ గా నటించిన ఈ ఇద్దరూ ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ప్రభాస్ అయితే ఏకంగా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన గోపీచంద్ కోసం ఏకంగా తన స్నేహితులతో కలిసి ఒక సినిమా కూడా ప్రొడ్యూస్ చేశాడు. అయితే.. “వర్షం” వచ్చి 15 ఏళ్ళు పూర్తవుతున్న తరుణంలో ప్రభాస్ తో తన రిలేషన్ గురించి గోపీచంద్ మాట్లాడుతూ.. “నాకు ఇండస్ట్రీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ప్రభాస్.. “వర్షం” తర్వాత మా ఇద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రాలేదు, చాలాసార్లు అనుకున్నాం కానీ మంచి కథ వర్కవుట్ అవ్వలేదు. అయితే.. త్వరలోనే మా ఇద్దరి కాంబినేషన్ లో మల్టీస్టారర్ తప్పకుండా ఉంటుంది” అని ప్రామిస్ చేశాడు గోపీచంద్.
ప్రభాస్ ప్రస్తుతం “సాహో” సినిమాతోపాటు రాధాకృష్ణతో దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ తదుపరి చిత్రం ఏమిటి అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి.. గోపీచంద్ తో కలిసి ప్రభాస్ నటించే సినిమా అదే కావచ్చు అనేది ప్రస్తుతానికి ఇండస్ట్రీ టాక్.