ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? .. ఈ ప్రశ్నకు గత ఐదేళ్లుగా “బాహుబలి సినిమా పూర్తి అయిన తర్వాత” అని సమాధానం వచ్చేది. కానీ బాహుబలి ప్రాజక్ట్ పూర్తి అయి రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మొన్న చెన్నై లో జరిగిన ప్రెస్ మీట్ లో అదే ప్రశ్నను ప్రభాస్ ని అడిగితే.. “బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటానని నేను ఎప్పుడు చెప్పాను.. అదంతా మీడియా సృష్టి” అని తప్పించుకున్నారు. డార్లింగ్ కి అనుష్క కూడా సపోర్ట్ గా నిలిచింది. ప్రభాస్ పెళ్లి విషయంలో అటువంటి నియమం ఏమీ పెట్టుకోలేదని మీడియా ముందు చెప్పింది. అప్పటి నుంచి ప్రభాస్ అభిమానులు పెళ్లి ఎప్పుడు అనే ? ప్రశ్న పక్కన పెట్టి.. మీ జంట సూపర్ అంటూ ప్రభాస్, అనుష్క ల ఫొటోస్ షేర్ చేస్తున్నారు. అందుకు అన్ని వైపులా నుంచి మంచి స్పందన వస్తోంది.
ఆన్ స్క్రీన్ లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోను ఈ జంట చూడ ముచ్చటగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తూ వారిద్దరి ఫోటోలను షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ పేజీల్లో చూసిన ప్రభాస్, అనుష్క టాపిక్ ఉంటోంది. అంతేకాదు ఈ మధ్య అనుష్క, ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్నను ఎక్కువమంది గూగుల్ ని అడుగుతున్నట్లు తెలిసింది. ఇలా వీరి పెళ్లి విషయం నెట్లో దుమారం రేగుతోంది. ఇద్దరిలో ఎవరో ఒకరి పెళ్లి వార్త బయటికి వచ్చేవరకు ఈ హడావుడి తగ్గేలా లేదు. ఎప్పుడు ఆ శుభవార్త చెబుతారో బాహుబలి హీరోహీరోయిన్లు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.