Prabhas: క్లైమాక్స్ తో సినిమా రిజల్ట్ మార్చేస్తున్న ప్రభాస్.. మ్యాజిక్ చేశాడంటూ?
June 27, 2024 / 05:26 PM IST
|Follow Us
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కల్కి మూవీ ఫీవర్ నడుస్తోంది. ఉదయం 4 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కల్కి (Kalki 2898 AD) షోలు ప్రదర్శితం అవుతుండగా 99 శాతం మంది ప్రేక్షకులు ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా నాగ్ అశ్విన్ (Nag Ashwin) మూడు ప్రపంచాలను చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాలోని యాక్షన్ సీన్స్ మాత్రం వావ్ అనేలా ఉన్నాయని చెప్పవచ్చు. సినిమాలో చిన్నచిన్న మైనస్ లు ఉన్నా ప్రభాస్ (Prabhas) , అమితాబ్ (Amitabh Bachchan) యాక్టింగ్ ముందు ఆ తప్పులను ఎవరూ పట్టించుకోరు.
సలార్ (Salaar) క్లైమాక్స్ ప్రేక్షకులకు ఏ స్థాయిలో నచ్చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కల్కి క్లైమాక్స్ అంతకు మించి అనేలా ఉంది. సినిమా అంతా ఒక ఎత్తు క్లైమాక్స్ మరో ఎత్తు అనేలా ఈ సినిమా ఉంది. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మ్యాజిక్ చేశారనే చెప్పాలి. కల్కి 2898 ఏడీ మూవీ మూడు గంటల నిడివితో తెరకెక్కినా సినిమా చూస్తున్న సమయంలో ఆ భావన ఎక్కడా కలగదు.
ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ నిడివి వల్ల మిస్ అయ్యాయని భవిష్యత్తులో ఆ సీన్స్ ను యాడ్ చేస్తే బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాహుబలి2 (Baahubali 2) తర్వాత ప్రభాస్ కెరీర్ లో ఆ స్థాయి సినిమాగా కల్కి నిలుస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఎన్ని భాగాలుగా తెరకెక్కినా కల్కి సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ప్రభాస్ లుక్స్, డైలాగ్ డెలివరీ నెక్స్ట్ లెవెల్ లో ఉండగా ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంతో కష్టపడ్డారని మూవీ చూస్తే అర్థమవుతోంది. సినిమా రెండుసార్లు వాయిదా పడినా ఆ ఎదురుచూపులకు తగ్గ ప్రతిఫలం మూవీ రూపంలో దక్కిందనే చెప్పాలి. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమా బిర్యానీ లాంటి మూవీ చెప్పవచ్చు. గ్రాఫిక్స్ తో ఏ స్థాయిలో అద్భుతాలు సృష్టించవచ్చో నాగ్ అశ్విన్ ఈ సినిమాతో చెప్పకనే చెప్పేశారు.