యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మరో అద్భుత కార్యాక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఖాజీపల్లి రిజర్వు ఫారెస్ట్ ని దత్తత తీసుకోవడం జరిగింది. 1650 ఎకరాల విశాలం గల ఈ రిజర్వు ఫారెస్ట్ అభివృద్ధికి ప్రభాస్ నిధులు సమకూర్చనున్నారు. మొదటి విడతగా ప్రభాస్ 2కోట్ల రూపాయల విరాళం ప్రకటించడం జరిగింది. ఫారెస్ట్ అభివృద్ధి ఆధారంగా ప్రభాస్ నిధులు అందించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో గల దుండిగల్ ఖాజీపల్లి రిజర్వు ఫారెస్ట్ అభివృద్ధికి ప్రభాస్ కృషి చేయనున్నారు.
ఎంపీ సంతోష్ కుమార్ జోగినపల్లితో కలిసి ఈ కార్యక్రమానికి ప్రభాస్ శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రభాస్ తండ్రిగా గారిపేరును ఈ ఫారెస్ట్ కి నామకరణం చేయడం విశేషం. ఇక రెండు రోజుల క్రితం తన వ్యక్తిగత జిమ్ ట్రైనర్ కి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిన ప్రభాస్, కరోనా క్రైసిస్ ఛారిటీ కొరకు 50లక్షలు సాయం చేశారు. ఇక కరోనా పై పోరాటంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి మొత్తం 4 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది.
టాలీవుడ్ నుండి ఇంత పెద్ద మొత్తంలో సహాయం చేసిన ఏకైక హీరో ప్రభాస్ కావడం విశేషం. తాజాగా ప్రకృతి పరిరక్షణలో భాగంగా ఖాజిపల్లి రిజర్వు ఫారెస్ట్ అభివృద్ధి బాధ్యతను తీసుకోవడం జరిగింది. ఇక దేశంలోనే టాప్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుత రెమ్యూనరేషన్ 100కోట్ల వరకూ ఉందని సమాచారం. ఇక కొద్దిరోజులలో రాధే శ్యామ్ షూటింగ్ లో పాల్గొననున్న ప్రభాస్, నాగ్ అశ్విన్, ఆదిపురుష్ అనే భారీ చిత్రాలలో నటించాల్సివుంది.
1
2
3
4
5
Most Recommended Video
వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!