ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం కొంతమందికి మాత్రమే ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి హీరో ప్రభాస్ (Prabhas) మాత్రమేనని చెప్పవచ్చు. క్రేజ్, రెమ్యునరేషన్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా చాలామంది హీరోలతో పోల్చి చూస్తే ప్రభాస్ ఎక్కడో ఉన్నారు. ప్రభాస్ సినిమా విడుదలైతే ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్లు సులువుగా 100 కోట్ల రూపాయల మార్క్ ను క్రాస్ చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఒకటి కంటే ఎక్కువ సినిమాలలో నటిస్తున్నా ఏ నిర్మాతను ఇబ్బంది పెట్టకుండా డేట్స్ కేటాయిస్తూ ప్రభాస్ నిర్మాతల హీరోగా పేరు సంపాదించుకున్నారు.
ఆరు నెలలకు ఒక సినిమా విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న ప్రభాస్ తన సినిమాలతో థియేటర్లు కళకళలాడటానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలీవుడ్ స్టార్స్ సైతం షాకయ్యేలా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సత్తా చాటుతున్న ప్రభాస్ అభిమానులు లేకపోతే నేను జీరో అంటూ తన సక్సెస్ కు అభిమానులే కారణమంటూ ఫ్యాన్స్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.
ప్రభాస్ కామెంట్లు విన్న నెటిజన్లు అభిమానులను ఇంతలా గౌరవించే మరో హీరో ఉంటారా అని కామెంట్లు చేస్తున్నారు. మా డార్లింగ్ మనస్సు బంగారం అని అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ తో పని చేసిన దర్శకులు ఆయనతో మళ్లీమళ్లీ పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
బాహుబలి2 (Baahubali 2) , సలార్(Salaar) , కల్కి (Kalki 2898 AD) సినిమాల విజయాలు టాలీవుడ్ స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. అవార్డ్స్ విషయంలో సైతం కల్కి మూవీ అదరగొట్టడం పక్కా అని చెప్పవచ్చు. కల్కి సినిమాను హిట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పిన ప్రభాస్ ఫ్యాన్స్ లేకపోతే నేను జీరోనే అని కామెంట్లు చేశారు. ప్రభాస్ రీల్ లైఫ్ లో మాత్రమే కాదని రియల్ లైఫ్ లో కూడా గొప్ప హీరో అని ఫ్యాన్స్ చెబుతున్నారు.