టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ప్రస్తుతం సలార్ సక్సెస్ తో సంతోషంగా ఉన్నారు. హిందీలో సైతం ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలను రిలీజ్ చేస్తానని చెప్పిన ప్రభాస్ ఆ మాటను నిలబెట్టుకున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ సినిమాలలో ఆదిపురుష్ అంచనాలను అందుకోకపోయినా సలార్ మాత్రం అంచనాలను అందుకుంది. ప్రభాస్ కు సక్సెస్ రావడం కష్టమని కొంతమంది జ్యోతిష్కులు చేసిన కామెంట్లు సైతం నిజమయ్యే ఛాన్స్ లేదని ఈ సినిమా ప్రూవ్ చేసింది. సలార్ సక్సెస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలకు ఈ సినిమా మంచి లాభాలను అందించింది. సంక్రాంతి సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే వరకు సలార్ మూవీకి పోటి పోటీ లేనట్టేనని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. సలార్ సక్సెస్ తో ప్రభాస్ పారితోషికం సైతం అమాంతం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. వరుస విజయాలతో ప్రభాస్ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు.
స్టార్ హీరో ప్రభాస్ 2024లో సైతం రెండు లేదా మూడు సినిమాలను విడుదల చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై ఊహించని రేంజ్ లో అంచనాలు పెరుగుతున్నాయి. ప్రభాస్ ఒక సినిమాకు మరో సినిమాకు పోలిక లేకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాల్సి ఉంది. ప్రభాస్ పారితోషికం విషయంలో కూడా టాప్ లో నిలుస్తున్నారు.