ఫ్లాప్ ఇచ్చిన డైరక్టర్ తో ప్రభాస్ మళ్ళీ మూవీ చేస్తాడా ?

  • July 1, 2017 / 01:56 PM IST

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన వారిని, ప్రభాస్ అభిమానులను తాజాగా వేధిస్తున్న ప్రశ్న “ఫ్లాప్ ఇచ్చిన డైరక్టర్ తో ప్రభాస్ మళ్ళీ మూవీ చేస్తాడా ?” అని. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేము కానీ.. అసలు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే .. ప్రభాస్ తో క్లాసికల్ మూవీ పౌర్ణమి ని తెరకెక్కించిన ప్రభుదేవా ఈసారి ఊరమాస్ సినిమా చేయబోతున్నట్లు రెండు రోజులుగా వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తోన్న ప్రభాస్, ఆ తరువాత ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణతో ఒక సినిమా చేయాలి. కానీ అతన్ని పక్కన పెట్టి ప్రభాస్ ప్రభుదేవాతో మూవీ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది.

దీనిపై ఎవరూ అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ అభిమానులు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాప్ ఇచ్చిన డైరక్టర్ తో మళ్ళీ సినిమా ఏంటని ? ఆందోళన చెందుతున్నారు. ఇక సినీ విశ్లేషకులు మాత్రం బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగింది. ఈ సమయంలో క్రేజ్ తగ్గిన ప్రభుదేవాతో సినిమా చేసే సాహసం చేయడని చెబుతున్నారు. మరి ప్రభాస్ మనసులో ఏముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus