Prabhas: కల్కి కొత్త పోస్టర్ లో ఇది గమనించారా.. ఏం జరిగిందంటే?
March 9, 2024 / 04:16 PM IST
|Follow Us
ఈ ఏడాది థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలలో అత్యంత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డ సినిమాలలో కల్కి సినిమా ఒకటి. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా (Deepika Padukone) దీపికా పదుకొనే, దిశా పటానీ (Disha Patani) ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో (Prabhas) ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. పోస్టర్ లో ప్రభాస్ గెటప్ కొత్తగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ గురించి లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
అయితే కల్కి 2898 ఏడీ చెప్పిన తేదీకే విడుదలవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ కు మే నెల 9వ తేదీ ఎంతో కీలకం అనే సంగతి తెలిసిందే. అందువల్ల ఆ తేదీని ఈ బ్యానర్ మిస్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు. ఇన్నిరోజులు సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు కల్కి అని ఫ్యాన్స్ ఫీలయ్యారు. అయితే పాత్ర పేరు అది కాదని పరిచయం చేసి నాగ్ అశ్విన్ కన్ఫ్యూజన్ కు తెర దించారు.
త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ అయితే వచ్చే ఛాన్స్ మాత్రం ఉంది. కల్కి సినిమా నుంచి ట్రైలర్ విడుదలైతే ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకోవచ్చో ఫ్యాన్స్ కు సైతం క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో మరింత వేగం పెరగాలని కోరుకుంటున్నారు. ఇతర సినిమాలకు భిన్నమైన సినిమా కావడంతో ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.
నాగ్ అశ్విన్ ఈ సినిమాతో పాన్ వరల్డ్ డైరెక్టర్ల జాబితాలో చేరతాడని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోందని సమాచారం అందుతోంది.