Prabhas: ప్రాజెక్ట్ కేను టార్గెట్ చేసే ఛాన్స్ ఉందా.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆవేదన ఏంటంటే?
September 15, 2023 / 02:09 PM IST
|Follow Us
ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమా బడ్జెట్ హద్దులు దాటిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 800 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ లేకపోయినా 2024 ఎన్నికల ఫలితాల తర్వాతే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ కే నిర్మాత అశ్వనీదత్ తాజాగా చంద్రబాబుకు అనుకూలంగా కామెంట్లు చేశారు.
అశ్వనీదత్ చేసిన కామెంట్ల వల్ల ప్రాజెక్ట్ కేను టార్గెట్ చేసే ఛాన్స్ ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైరల్ అవుతున్న వార్తలు ప్రభాస్ ఫ్యాన్స్ ను ఒకింత టెన్షన్ పెడుతున్నాయి. అయితే ప్రభాస్ సినిమాల విషయంలో వైసీపీ గతంలో కఠినంగా వ్యవహరించలేదు. ప్రభాస్ సినిమాలకు ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా అనుమతులు లభించాయనే సంగతి తెలిసిందే.
ప్రాజెక్ట్ కే రిలీజ్ సమయానికి పరిస్థితులు కూడా పూర్తిస్థాయిలో మారిపోయే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ కే సినిమాకు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తుండగా ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా వేర్వేరు భాషల్లో రిలీజవుతోంది. దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ (Prabhas) హీరోగా కమల్ విలన్ గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
క్యాస్టింగ్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెరగగా ఈ సినిమా నిరాశపరిచే అవకాశం అయితే లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా విషయంలో నాగ్ అశ్విన్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ప్రభాస్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ప్రభాస్ సినిమాలు బడ్జెట్ కు రెట్టింపు స్థాయిలో కలెక్షన్లను సాధించాలని అభిమానులు ఫీలవుతున్నారు.