స్టార్ హీరో ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 5 పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల పారితోషికం చొప్పున ప్రభాస్ ఈ ఐదు సినిమాలకు ఏకంగా 500 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. బాహుబలి, బాహుబలి2 సినిమాల విజయాలతో ప్రభాస్ పారితోషికం భారీగా పెరిగింది. రాబోయే మూడేళ్లలో ప్రభాస్ నటించిన ఐదు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే ప్రభాస్ తన రెమ్యునరేషన్ ను ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రభాస్ తన స్నేహితులు, బంధుమిత్రులతో వేర్వేరు వ్యాపారాల గురించి చర్చించారని బోగట్టా. ప్రభాస్ కు కొంతమంది హోటల్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలని సూచనలు చేయగా మరి కొందరు మాత్రం రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. కొంతమంది సన్నిహితులు విదేశీ హోటల్స్ లో ఇన్వెస్ట్ చేయాలని సూచనలు చేసినట్టు సమాచారం. ప్రభాస్ స్నేహితులు వంశీ, ప్రమోద్ ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నారు. ప్రభాస్ స్నేహితులు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సొంతంగా సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
వంశీ, ప్రమోద్ ఇచ్చిన సలహాలనే ప్రభాస్ పాటించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ప్రభాస్ హోటల్స్ లేదా రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే ప్రభాస్ పారితోషికం మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ప్రభాస్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.