Prabhas: స్టార్ హీరో ప్రభాస్ ఖాతాలో ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయా?
July 4, 2024 / 11:23 AM IST
|Follow Us
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కెరీర్ పరంగా వరుస విజయాలను సొంతం చేసుకుంటూనే అంతకంతకూ ఎదుగుతున్నారు. స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు ఆరు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ సీక్వెల్ (Salaar) , కల్కి సీక్వెల్ (Kalki 2898 AD) , కన్నప్ప (Kannappa) , రాజాసాబ్ (The Rajasaab) , హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్ లో ఒక సినిమా, స్పిరిట్ (Spirit) సినిమాలలో ప్రభాస్ నటిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల బడ్జెట్ ఏకంగా 2000 కోట్ల రూపాయల బడ్జెట్ అని సమాచారం అందుతోంది.
ప్రభాస్ ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ తన సినిమాలలో యాక్షన్ సీన్లు ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
అయితే ప్రభాస్ తన సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నా ఒదిగి ఉంటూ అభిమానులకు దగ్గరవుతున్నారు. ప్రభాస్ క్రేజ్ పరంగా టాప్ లో ఉన్నా సింపుల్ గా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ వీకెండ్ సమయానికి కల్కి 2898 ఏడీ సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కల్కి సీక్వెల్ షూటింగ్ త్వరలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత పదేళ్లలో ప్రభాస్ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన మరే హీరో లేరనే చెప్పాలి. అయినప్పటికీ ప్రభాస్ మాత్రం గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటున్నారు. ఒకే సమయంలో ఎక్కువ సినిమాల్లో నటించడం ప్రభాస్ కు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పవచ్చు.