Prabhas: ప్రభాస్ క్రేజ్ కు ఆ రికార్డులు బ్రేక్ కాబోతున్నాయా?

  • February 20, 2023 / 03:28 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉండగా ఏడు నెలల్లో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆదిపురుష్ మూవీ జూన్ నెలలో రిలీజ్ కానుండగా సలార్ మూవీ సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానుండగా ప్రాజెక్ట్ కే సినిమా 2024 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూడు సినిమాలు 1300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

చాలామంది స్టార్ హీరోలు రెండేళ్లకు ఒక సినిమాను రిలీజ్ చేయడానికి కష్టపడుతుంటే ప్రభాస్ మాత్రం వేగంగా సినిమాలను విడుదల చేస్తూ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ మూడు సినిమాలతో ప్రభాస్ ఏ రేంజ్ రికార్డులను బాక్సాఫీస్ వద్ద సృష్టించనున్నారో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో 7 నెలల్లో మూడు సినిమాలను రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో ప్రభాస్ మాత్రమేనని చెప్పాలి.

స్టార్ హీరో ప్రభాస్ క్రేజ్ కు ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద క్రియేట్ అయిన రికార్డులు బ్రేక్ అవుతాయని అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్ ఈ మూడు సినిమాలకు 350 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారు. ఒక సినిమాకు మరో సినిమాకు ఏ మాత్రం పొంతన లేకుండా ప్రభాస్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్నారు. ప్రభాస్ ప్రాజెక్ట్ లకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా తర్వాత సినిమాలతో ప్రభాస్ కచ్చితంగా విజయాలను అందుకోవడంతో పాటు తనపై విమర్శలు చేసేవాళ్లకు ఘాటుగా జవాబు ఇస్తాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ నటిస్తున్న సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభాస్ సైతం తన సినిమాల ఫలితాల విషయంలో పూర్తిస్థాయి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus