Prabhas: విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాస్.. అదే కారణమంటూ?

  • July 31, 2022 / 12:07 PM IST

స్టార్ హీరో ప్రభాస్ కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు. గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు కళ్లు చెదిరే స్థాయిలో బిజినెస్ జరుగుతోందనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ ను పూర్తి చేయగా సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల షూటింగ్ లు జరుగుతున్నాయి. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ పాన్ ఇండియా సినిమాలు అనే సంగతి తెలిసిందే.

అయితే ప్రభాస్ ప్రస్తుతం యూరప్ లో ఉన్నారు. బాహుబలి మూవీ షూటింగ్ సమయంలో ప్రభాస్ కాలికి గాయమైంది. ప్రభాస్ యూరప్ లో సర్జరీ చేయించుకోగా స్టంట్స్ చేసే సమయంలో ఆ గాయం తిరగబెట్టిందని తెలుస్తోంది. ప్రభాస్ ను పరీక్షించిన వైద్యులు 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచనలు చేశారని సమాచారం అందుతోంది. ప్రభాస్ మరికొన్ని రోజుల పాటు షూటింగ్ కు హాజరయ్యే అవకాశాలు లేవని సమాచారం.

సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల షూటింగ్ లు నిలిచిపోయాయని ప్రభాస్ కు గాయం తగ్గిన తర్వాతే ఈ సినిమాల షూటింగ్ లు మళ్లీ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్ నటించిన మూడు సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానున్నాయని బోగట్టా. పక్కా కమర్షియల్ ఫ్లాప్ అయినా మారుతి ప్రభాస్ కాంబో మూవీ ఆగిపోలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న టాలీవుడ్ హీరోలలో ప్రభాస్ ఒకరు. బాహుబలి2 సినిమాతో ఎన్నో సంచలన రికార్డులను ఖాతాలో వేసుకున్న ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు ప్రభాస్ రేంజ్ పెరుగుతుండగా ప్రభాస్ తర్వాత సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus