Prabhas: ప్రభాస్ ఎప్పుడు గడ్డంతో ఉండటానికి అదే కారణమా?

  • February 20, 2023 / 02:52 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ రెబెల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.ఇలా పాన్ ఇండియా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ అనంతరం తన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఈయనకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని చెప్పాలి ఇక ప్రభాస్ గడ్డంతో ఉండే లుక్ అంటే అమ్మాయిలు కూడా తెగ ఇష్టపడుతూ ఉంటారు.సాధారణంగా అబ్బాయిలు చాలా స్టైలిష్ గా కనిపించడం కోసం ఇలా గడ్డం పెంచుతూ ఉంటారు కానీ ప్రభాస్ మాత్రం గడ్డం పెంచడం వెనుక మరో కారణం ఉందట.

ప్రభాస్ ఇలా గడ్డం పెంచుకోవడానికి గల కారణాన్ని ఓ సందర్భంలో తెలియజేశారు. ప్రభాస్ తండ్రి 2010 సంవత్సరంలో మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే అప్పటినుంచి తన తండ్రిని ఎంతో మిస్ అవుతున్నటువంటి ప్రభాస్ తన తండ్రి గుర్తుకొచ్చిన ప్రతిసారి అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటాడట.గడ్డంలో ఉన్న తనని చూసుకుంటే తన తండ్రిని చూసిన ఫీలింగ్ తనకు కలుగుతుందని తన తండ్రి తనతో పాటే ఉన్నారనే నమ్మకాన్ని కలిగిస్తుందని తెలిపారు.

ఈ విధంగా ప్రభాస్ తన తండ్రిని తనలో చూసుకోవడం కోసమే ఇలా గడ్డం పెంచుకుంటున్నారని తెలియజేయడంతో ఈయనకు తన తండ్రి అంటే ఎంత ప్రేమ అర్థమవుతుంది. ఇలా తాను గడ్డం పెంచడం గురించి ప్రభాస్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన ప్రస్తుతం ప్రాజెక్టుకే, సలార్, మారుతి డైరెక్షన్లో రాబోతున్న సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే ఈయన నటించిన ఆది పురుష్ విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే స్పిరిట్ సినిమా షూటింగులో కూడా పాల్గొనబోతున్నారు.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus