మార్షల్ ఆర్ట్స్ కి చైనా పెట్టింది పేరు. ఆ దేశంలో ఎన్నో యుద్ధ కళలు ఉన్నాయి. అక్కడి ప్రజలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు మక్కువ చూపిస్తుంటారు. అందుకే అక్కడ చిత్రాల్లో హీరోలు అద్భుతంగా ఫైట్స్ చేసి అలరిస్తుంటారు. సూపర్ స్టార్ గా కీర్తి పొందుతుంటారు. ఆ జాబితాలోకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేరారు. మన డార్లింగ్ అక్కడ కొత్త మార్షల్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సాధించారు. జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును అందుకున్న బాహుబలి (ది బిగినింగ్) గత నెల 22 న చైనాలో 6000 థియేటర్లలో విడుదలై రికార్డ్ సృష్టించింది.
చైనీయులు ప్రభాస్ కు ఫ్యాన్స్ అయిపోయారు. చిత్రంలో ఆయన నటనతో పాటు ఫైట్లు చూసి ఫ్లాట్ అయిపోయారు. ముఖ్యంగా శివుడు ఎతైన కొండను ఎక్కడం చూసి ఆశ్చర్య పోతున్నారు. ఒక వైపు వేగంగా నీటి ప్రవాహం, జారే కొండలను ఎక్కే సాహసం చేసిన ప్రభాస్ ని యుద్ధ కళలో నైపుణ్యుడిగా భావిస్తున్నారు. ప్రభాస్ మరిన్ని సాహసాల కోసం బాహుబలి కంక్లూజన్ కోసం ఎదురుచూస్తున్నారు. చైనాలోనే కాదు ప్రపంచంలోని సినీ అభిమానులందరూ బాహుబలి ముగింపు చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు. వారి అంచనాలకు మించి సినిమా ఉండేలా దర్శక ధీరుడు రాజమౌళి శ్రమిస్తున్నారు.
ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్లో బాహుబలి కంక్లూజన్ క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో ప్రభాస్, రానా, తమ,న్నాఐదు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న ప్రపంచం మొత్తం విడుదల కానుంది.