‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ కి హిట్టు పడలేదు. అలా అని అతని ఇమేజ్ పడిపోలేదు. సినిమా సినిమాకి పెరుగుతూనే ఉంది. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ ‘సాహో’ ‘రాధే శ్యామ్’ ‘ఆదిపురుష్’ వంటి సినిమాలు చేశాడు. ఇవి కంటెంట్ పరంగానూ, బాక్సాఫీస్ ఫైనల్ రిజల్ట్స్ పరంగానూ నిరాశపరిచాయి. కానీ ఈ సినిమాల ఓపెనింగ్స్ ను కనుక గమనిస్తే.. భారీగానే నమోదయ్యాయి. ఇప్పుడు ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. ‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది.
మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.రిలీజ్ కి రెండు, మూడు రోజుల ముందు నుండి టికెట్ల కోసం అభిమానుల పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పుడు హిట్ టాక్ వచ్చింది కాబట్టి.. ఆ ఊపు ఈ వీకెండ్ మొత్తం ఉంటుంది. సరే ఈ విషయాలు పక్కన పెట్టేసి.. ప్రభాస్ నటించిన గత 10 సినిమాలు, మరియు వాటి బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :
1) ఏక్ నిరంజన్ :
ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా రూ.17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.10 .2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ప్లాప్ గా మిగిలింది.
2) డార్లింగ్ :
ప్రభాస్ హీరోగా కరుణాకరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.16.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.22.91 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి డీసెంట్ హిట్ అనిపించుకుంది.
3) మిస్టర్ పర్ఫెక్ట్ :
ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.27.92 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి సూపర్ హిట్ అనిపించుకుంది.
4) రెబల్ :
ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.27.3 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టి ప్లాప్ గా మిగిలింది.
5) మిర్చి :
ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ మూవీ రూ.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.47.7 కోట్ల షేర్ ని రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
6) బాహుబలి ది బిగినింగ్ :
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.148 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.302.3 కోట్ల షేర్ ను రాబట్టి.. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
7) బాహుబలి 2 (బాహుబలి ది కన్క్లూజన్) :
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.350 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.814.10 కోట్ల షేర్ ను రాబట్టి.. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
8) సాహో :
ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.290 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.232.60 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ, హిందీలో సూపర్ హిట్ గా నిలిచింది.
9) రాధే శ్యామ్ :
ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.200 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.86.41 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఈ మూవీ డబుల్ డిజాస్టర్ గా మిగిలింది అని చెప్పాలి.
10) ఆదిపురుష్ :
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రూ.230 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.196.58 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి ప్లాప్ గా మిగిలింది.