ప్రభాస్ సెట్ చేసిన ఫ్యాషన్, ఫిట్ నెస్ గోల్స్

  • March 17, 2017 / 07:47 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటనతో పాటు స్టైల్ తోను ఆకట్టుకుంటారు. ప్రతి సినిమాలోనూ తన మేకోవర్ పై దృష్టి పెట్టి అమ్మాయిలకు డార్లింగ్ అయ్యారు. కథకు తగినట్లు బాడీని మార్చుకోవడంలో ప్రభాస్ ముందు ఉంటారు. హెయిర్ స్టైల్ నుంచి షూ వరకు ప్రత్యేకత చూపిస్తారు. అందుకే యువత అతన్ని ఫాలోఅవుతుంటారు. ప్రభాస్ సెట్ చేసిన ప్రభాస్ ఫ్యాషన్, ఫిట్ నెస్ గోల్స్ పై ఫోకస్..

ఫ్యాషన్ గోల్స్

ఛత్రపతి ప్రభాస్ యాక్షన్ డోస్ పెంచిన మూవీ ఛత్రపతి. ఇందులో రెబల్ స్టార్ కండలు పెంచి కటౌట్ లోనే కాదు డ్రస్ పై శ్రద్ధ పెట్టాడు. టైట్ హాఫ్ డెనిమ్ జీన్ షర్ట్ లో అదరగొట్టాడు.

మున్నా వంశీ పైడి పల్లి దర్శకత్వంలో వచ్చిన మున్నా లో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడు. జుట్టు పెంచి, వేలికి స్వీట్ బ్యాండ్ వేసాడు. అంతేకాదు డెనిమ్ కాలర్ టీ షర్టులు, షేడెడ్ జీన్స్ తో ఇరగదీసాడు.

డార్లింగ్ డార్లింగ్ మూవీలో ప్రభాస్ అనేక ఫ్యాషన్ వేర్ ధరించారు. కానీ హాఫ్ హ్యాండ్ ప్రింటెడ్ టీ షర్టులు అభిమానులకు భలే నచ్చాయి. వాటికి మంచి క్రేజ్ ఏర్పడింది.

రెబల్రెబల్ మూవీలో ఫుల్ హ్యాండ్ టీ షర్ట్స్ తో పాటు యువకులను ఆకర్షించిన ఫ్యాషన్ లార్జ్ బకెల్ బెల్ట్. వీటితో కొత్త లుక్ తీసుకొచ్చారు.

మిర్చిఆరు అడుగుల అందగాడు ఫార్మల్ వేర్ లో సూపర్ గా ఉంటాడని మిర్చిలో చూపించారు. ఇందులో ఫార్మల్ వేర్ తో పాటు ఆటో లాక్ బెల్ట్ ట్రెండ్ సృష్టించింది.

ఫిట్ నెస్ గోల్స్

సిక్స్ ప్యాక్ ఆరడుగుల వ్యక్తి సిక్స్ ప్యాక్ తో కనిపిస్తే ఎలా ఉంటుందో బాహుబలి చిత్రంలో ప్రభాస్ కనిపించారు. షర్ట్ లెస్ గా సిక్స్ ప్యాక్ తో కనిపించి అమ్మాయిలకు నిద్రలేకుండా చేసాడు. యువకులకు జిమ్ కి వెళ్ళడానికి స్ఫూర్తినిచ్చాడు.

ఎయిట్ ప్యాక్ బిల్లా మూవీ కోసం ప్రభాస్ చాలా శ్రమించారు. చాలా స్లిమ్ గా కనిపించడానికి ఎయిట్ ప్యాక్ రప్పించారు. ఫైట్స్ లో కాసేపు ఎయిట్ ప్యాక్ లో డార్లింగ్ కనిపించి అందరినీ ఫిట్ నెస్ గురు అనిపించుకున్నాడు.

భారీ కండలు రెబల్ మూవీలో ప్రభాస్ భారీ కండలతో దడ పుట్టించాడు. ఆయా సినిమా తర్వాత ఆ కండలను సొంతం చేసుకోవాలని జిమ్ ల్లో ఎక్కువ సమయం గడిపేవారిని అప్పట్లో చాలా మందిని చూసాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus