మురుగుదాస్ ప్రభాస్ కాంబినేషన్ షురూ అయినట్లేనా?

  • September 6, 2017 / 01:35 PM IST

టాలీవుడ్ టాప్ హీరోల్లో ప్రభాస్ ఒకడు. బాహుబలి ముందు వరకూ ప్రభాస్ రేంజ్ వేరు, టాలీవుడ్ వరకే పరిమితం అయిన ప్రభాస్ మ్యానియా ఒక్క దెబ్బతో ప్రపంచం అంతా పాకిపోయింది. అయితే అదే క్రమంలో ప్రభాస్ బాహుబలి తరువాత తాను చేస్తున్న మూవీ సాహోతో మరోసారి ప్రపంచాన్ని తాకాలేనే ఆలోచనతో ఉన్నాడు. ఇక దాదాపుగా 150కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్న ఈ సినిమా నాలుగు బాషల్లో విడుదల అవుతూ ఉండడం విశేషం. అయితే అదే క్రమంలో సాహో తరువాత ప్రభాస్ ఈ సినిమాలో నటించనున్నాడు? అసలు ప్రభాస్ ఏ దర్శకుడితో సినిమా చెయ్యనున్నాడు? అన్న ఆలోచనలలో ఉన్న దార్లింగ్ అభిమానులకు సినిమా సర్కిల్స్ లో శుభవార్త వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి ఆ శుభవార్త అంటే, టాలీవుడ్ నుంచి కాలీవుడ్ వరకూ మంచి టాలెంట్ ఉన్న దర్శకుల్లో తమిళ దర్శకుడు మురుగుదాస్ ఒకరు.

అయితే అలాంటి మురుగుదాస్ తో ప్రభాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంటుంది కదా, తమిళ తంబీలు చెబుతున్న మాటల ప్రకారం ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ మురుగుదాస్ తో చెయ్యనున్నాడు అన్న టాక్స్ బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే అదే క్రమంలో ఇదే విషయమై ఇటీవల ప్రభాస్‌తో మురుగదాస్‌ రెండు గంటల పాటు భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. మురుగదాస్‌ చెప్పిన కథ కూడా నచ్చిందని, త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది. మరో వైపు ‘స్పైడర్‌’ పూర్తయిన తర్వాత విజయ్‌తో కొత్త సినిమాకు శ్రీకారం చూడతారనే వాదనలు ఉన్నా…మురుగుదాస్ తరువాత సినిమా ప్రభాస్ తోనే అనే మాట కాస్త బలంగానే వినిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus