యంగ్ రెబల్ స్టార్ తర్వాతి సినిమాలో హీరోయిన్ పై చర్చ
November 2, 2016 / 06:15 AM IST
|Follow Us
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి కంక్లూజన్ తర్వాత చేసే సినిమాలు ఖరారయ్యాయి. ఈ రెండు చిత్రాలు యూవీ బ్యానర్లోనే ఉంటాయని డార్లింగ్ అందరికి స్పష్టం చేశారు. బాలీవుడ్ ఆఫర్లను సైతం కాదని ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ కి తన డేట్లను కేటాయించారు.150 కోట్లతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించనున్న ఈ మూవీకి లొకేషన్ ను వెతికే పనిలో సుజిత్ బిజీ అయ్యారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ నటించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే దానిపై అభిమానులకు ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో డార్లింగ్ సరసన అమీ జాక్సన్ నటించనున్నట్లు మొదట్లో వార్తలు వినిపించాయి.
ప్రస్తుతం ఆ స్థానంలో బాలీవుడ్ క్రేజీ నటి పరిణీతిచోప్రా వచ్చి చేరిందని టాక్. ఈ విషయంపై చిత్రబృందం ఎటువంటి ప్రకటన చేయలేదు. డిసెంబర్ లో పూజ కార్యక్రమాలు జరుపుకొని జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ మూవీలో అమీ జాక్సన్, పరిణీతి చోప్రా లతో పాటు మరో ఇద్దరు భామలు ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి బాలీవుడ్ లో మంచి ఓపెనింగ్స్ రావాలని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. వీరి హడావుడి చూస్తుంటే ఇందులో జేమ్స్ బ్యాండ్ సినిమాలోని యాక్షన్ సీన్స్ తో పాటు లిప్ లాక్ సీన్లు కూడా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.