స్టార్ హీరోల సినిమాల నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందనే సంగతి తెలిసిందే. పెద్ద హీరోల సినిమాల నిర్మాతలు ఫైనాన్స్ పై ఆధారపడి సినిమాలను నిర్మిస్తూ ఉంటారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మాత దానయ్య ఫైనాన్స్ మీద నిర్మించారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ రిలీజైన వారం రోజుల తర్వాత రాధేశ్యామ్ థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం.
అయితే ఈ సినిమా నిర్మాతలకు వడ్డీ భారమే 60 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ తెరకెక్కగా రెండు సంవత్సరాల పాటు ఈ సినిమా షూటింగ్ జరిగింది. బడ్జెట్ లో ప్రభాస్ రెమ్యునరేషన్ 80 కోట్ల రూపాయలు కాగా పాన్ ఇండియా మూవీగా రాధేశ్యామ్ తెరకెక్కడంతో మేకర్స్ ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కిన నేపథ్యంలో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రమే సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ప్రభాస్ ఈ సినిమాలో కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే రిలీజైన టీజర్ ను చూస్తే అర్థమవుతుంది. ప్రభాస్ రాధేశ్యామ్ తో కచ్చితంగా హిట్ సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ కనీసం 400 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాల్సి ఉంది.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!