Prabhas: ఆ సీన్ వల్ల ఇబ్బంది పడిన ప్రభాస్..?

  • June 4, 2021 / 05:29 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎలాంటి సన్నివేశంలోనైనా అద్భుతంగా నటించి తన నటనతో మెప్పించగలరు. ఈశ్వర్ సినిమా నుంచి సాహో సినిమా వరకు ప్రభాస్ తన నటనతో ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ప్రభాస్ ఒక సన్నివేశంలో నటించడానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో ప్రభాస్ చక్రం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అసిన్, ఛార్మీ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

అయితే థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ చిత్రానికి ప్రశంసలు మాత్రం దక్కాయి. సినిమాలో ప్రభాస్ నటనకు మంచి పేరు రావడంతో పాటు చక్రం పాత్రకు ప్రభాస్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారనే కామెంట్లు వినిపించాయి. అయితే ఆ సినిమాలో ప్రభాస్ ఒక సన్నివేశంలో ‘గే’గా కనిపించారు. అబ్బాయిలు అమ్మాయిలలా ప్రవర్తిస్తే తనకు నచ్చదని చక్రం సినిమాలో గే సన్నివేశం చేయడానికి ఇబ్బంది పడినా కృష్ణవంశీ మాత్రం రాజీ పడలేదని ప్రభాస్ తెలిపారు.

గే సీన్ చేయడం నా వల్ల కాలేదని ప్రభాస్ చెప్పుకొచ్చారు. సినిమాలో ఛార్మీ కుటుంబంలో గొడవ జరుగుతున్న సమయంలో యామినీ యామినీ అంటూ గే అవతారంలో ప్రభాస్ అల్లరి చేస్తారు. ప్రస్తుతం ప్రభాస్ మూడు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తుండగా రాధేశ్యామ్ మూవీ ఈ ఏడాది రిలీజ్ కానుంది. ప్రభాస్ నటిస్తున్న సలార్ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుండగా ఆదిపురుష్ వచ్చే ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కానుండటం గమనార్హం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus