Prabhas: ‘సీతా రామం’ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • August 3, 2022 / 11:13 PM IST

‘సీతా రామం’ ప్రీ రిలీజ్ వేడుకని చాలా సింపుల్ గా బ్యూటిఫుల్ గా ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వచ్చి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. సినిమా గొప్పతనం గురించి, థియేటర్ గొప్పతనం గురించి.. ప్రభాస్ చాలా గొప్పగా చెప్పాడు. ప్రభాస్ మాట్లాడుతూ “మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ స్వప్న గారు. మీరు సూపర్ … మీ కోసమే వచ్చాను. ట్రైలర్ ఎవరు కట్ చేశారో కానీ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. దుల్కర్.. మోస్ట్ హ్యాండ్సమ్ హీరో..! ఇండియాలో ఉన్న సూపర్ స్టార్స్ లో మీరు కూడా ఒకరు.

‘మహానటి’ లో మీ నటన సూపర్. చాలా గొప్ప చిత్రం అది. దత్ గారి దగ్గర నుండి అందరూ దుల్కర్, మృణాల్ నటన గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. రామ్, సీత.. లను థియేటర్లో చూడాలని నేను ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. ఎంతో ప్యాషనేట్ గా ఈ చిత్రాన్ని తీశారు. అంత ప్యాషన్ లేకపోతే ఇలాంటి సినిమా తీయడం సాధ్యం కాదు. ప్రేమకథతో పాటు యుద్ధం అలాగే అన్ని ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. కాశ్మీర్ లో షూట్ చేసారు, రష్యాలో కూడా షూట్ చేశారు.

ఓ సినిమాని రష్యాలో షూట్ చేయడం ఇదే మొదటి సినిమా అనుకుంటున్నాను. హను గారు మీ సినిమాలు చూసాను సార్.. మీరు చాలా బ్యూటిఫుల్ డైరెక్టర్. మీరు ఒక పొయెట్రీలా తీశారు సినిమాని అని నాగ్ అశ్విన్ చెప్పారు. సుమంత్.. మా డార్లింగ్.. ‘మీరు చేశారు అంటే.. ఆ రోల్ చాలా స్పెషల్ గా ఉంటుంది. నాగ్ అశ్విన్ గారు చెప్పడం లేదు. ఎన్టీఆర్ గారు దగ్గర నుండి మొదలు పెట్టి 50 ఏళ్ల వరకు బిగ్ బడ్జెట్ సినిమాలు తీస్తున్న అశ్వినీ దత్ గారు తెలుగులో ఉండటం మా అదృష్టం. రష్మిక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.

చాలా మంది బిగ్ స్టార్స్ ఉన్నారు ఈ సినిమాలో. కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి. రష్యా వెళ్లి, కాశ్మీర్ వెళ్లి ఎంతో బడ్జెట్ పెట్టి ఈ చిత్రాన్ని తీశారు. ఇంట్లో పూజ గది ఉంది కదా అని గుడికి వెళ్లడం మానేస్తామా. ‘సీతా రామం’ థియేటర్ కోసం తీసిన సినిమా. మా సినిమా ఫీల్డ్ కి మా థియేటరే గుడి. అది కూడా మీరిచ్చిందే. థియేటర్ కి వెళ్ళి ‘సీతా రామం’ చూడండి” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus