Prabhas: ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్ శ్రీను!
October 8, 2022 / 01:55 PM IST
|Follow Us
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు అత్యంత సన్నిహితులలో ప్రభాస్ శ్రీను ఒకరనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ కృష్ణంరాజు గారు మా గాడ్ ఫాదర్ అని ఆయన మాకు దేవుడితో సమానమని చెప్పుకొచ్చారు. కృష్ణంరాజు గారు నన్ను మంత్రి అని పిలిచేవారని సరదాగా ఉండేవాళ్లు అంటే కృష్ణంరాజు గారికి చాలా ఇష్టమని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు.
ప్రభాస్ గారంటే కృష్ణంరాజు గారికి పిచ్చి ప్రేమ అని ఆయన తెలిపారు. కృష్ణంరాజు గారి మరణం తీరని లోటు అని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. కృష్ణంరాజు గారు రాజు అని అందుకే నన్ను మంత్రి అని పిలిచేవారని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. కృష్ణంరాజు గారి వాయిస్ అంటే ఇష్టమని ఆయన వాయిస్ ను మిమిక్రీ చేయడం కూడా సులువు కాదని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు. ప్రభాస్ తో 25 సంవత్సరాల బంధం అంటే ఆ బంధం ఊరికే రాదని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు.
ఇండస్ట్రీలో ఏ లోటు లేకుండా ప్రభాస్ చూసుకున్నారని ఆయన అన్నారు. నాలాంటి తింగరోడిని భరిస్తున్నాడంటే ప్రభాస్ ఎంత గొప్ప వ్యక్తి అనే విషయం అర్థమవుతుందని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. ప్రభాస్ కు ప్రేమ, క్షమించే గుణం ఉండటం వల్లే ప్రభాస్ దగ్గర ఇన్నిరోజులు ఉండగలిగానని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు. ప్రభాస్ గారి మూడ్ ను బట్టి నేను ముందుకు వెళతానని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. మనకు మనం సాధించుకోవాలని అది డబ్బైనా మరేదైనా అంటూ ప్రభాస్ శ్రీను వెల్లడించారు.
ప్రభాస్ శ్రీను వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ శ్రీను తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్ శ్రీను కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.