‘డార్లింగ్’.. ‘డెవిల్’ కాదు.. నమ్మండి..!

  • December 28, 2019 / 05:30 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో తన 20 వ చిత్రమైన ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) చేస్తున్నాడు. ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణ మూవీస్’ సంస్థలు కలిసి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే కొంత భాగాన్ని షూట్ చేశారు. పిరియాడికల్ నేపథ్యంలో సాగే ప్రేమకధా చిత్రం ఇదని తెలుస్తుంది. ఈ చిత్రానికి ‘సైరా’.. మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిచనున్నాడు. ఇక ఈ చిత్రం పూర్తయిన వెంటనే ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు అనే వార్త ప్రచారంలో ఉంది.

ఈ ఏడాది బాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు సందీప్. ఇక తాజాగా ఆయన ‘డెవిల్’ అనే సినిమా తీయబోతున్నాడని.. ఈ చిత్రంలో హీరోగా ప్రభాస్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతుందని ప్రచారం జరిగింది. అయితే అలాంటిది ఏమీ లేదని.. ప్రభాస్ సన్నిహిత వర్గం చెప్పుకొస్తుంది. ప్రస్తుతం ‘జాన్’ చిత్రం పూర్తయ్యేవరకూ ప్రభాస్ మరో సినిమాకి కమిట్ అయ్యే ఛాన్స్ లేదని వారు తేల్చి చెప్పేసారు.

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus