బాహుబలి చిత్రంలో ప్రభాస్ ఎన్ని పాత్రలు పోషించారంటే ప్రతి ఒక్కరూ చెప్పే మాట రెండు. తండ్రి అమరేంద్ర బాహుబలి, కొడుకు మహేంద్ర బాహుబలి(శివుడు) క్యారెక్టర్లో డార్లింగ్ నటించారని అందరూ ఒప్పుకుంటారు. రెండు కాదు, ఈ చిత్రంలో ప్రభాస్ మూడు పాత్రలు పోషించారు అంటే… నమ్ముతారా? తప్పకుండా నమ్మాల్సిందే. అందుకు ఆధారాలతో సహా మీకు వివరిస్తాం. ఒక సారి మాహిష్మతి రాజ్యాన్ని పాలించిన రాజుల వంశ వృక్షాన్ని పరిశీలిస్తే.. విక్రమదేవుడు మొదట పరిపాలించేవాడు. అతను హఠాత్తుగా మరణించడంతో ఆ రాజ్య పాలనా బాధ్యతలు రాజమాత శివగామి (విక్రమదేవుడు అన్న బిజ్జలదేవ భార్య) తీసుకుంది.
అయితే విక్రమదేవుడు ని మొదటి పార్ట్ లో చూపించలేదు. గోడమీద పటాలకే పరిమితం చేశారు. అయితే ఆ పాత్రను కూడా ప్రభాస్ పోషించారు. అతని గురించి చిన్న సీన్ బాహుబలి 2 లో ఉంటుందని సమాచారం. విక్రమదేవుడు గా ప్రభాస్ ఐదు నిముషాల పాటు కనిపించే సీన్ సినిమాలో కీలకం కానుందని తెలిసింది. ఇలా మూడు తరాల రాజులుగా ప్రభాస్ ని చూపించి ఫ్యాన్స్ కి రాజమౌళి గిఫ్ట్ ఇవ్వనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.